మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్న రంగమిదే

0
1


మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్న రంగమిదే

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలను ఈ రంగం స్వాగతించింది. రూ.25,000 కోట్లతో అసంపూర్తి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో కేంద్రం రూ.10,000 కోట్లు, ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల నుంచి రూ.15,000 కోట్లు సమీకరిస్తారు. మోడీ ప్రభుత్వం నిర్ణయంపై రియల్ ఎస్టేట్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

క్రెడాయ్ హర్షం

ఇళ్ల కొనుగోలుదారులకు ఉన్న దీర్ఘకాల సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని క్రెడాయ్ చైర్మన్ వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన ప్యాకేజీని విస్తరించి, ఎన్పీఏలకు కూడా వర్తింపజేయడం బాగుందన్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో మందగమనం ఛాయలు తొలగిపోతాయన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించినట్లయింది

భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించినట్లయింది

కేంద్రం ఉద్దీపన వల్ల నిర్మాణ రంగ సంస్థలతో పాటు గృహ కొనుగోలుదారులకు కూడా మోడీ ప్రభుత్వం పెద్ద ఊరటను ఇచ్చిందని ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం కార్మికులకు పని కల్పించినట్లు అయిందన్నారు. ఇళ్ల కొనుగోళ్లు పెరుగడానికీ ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయం డబ్బులు చెల్లించి ఇల్లు పొందలేని వారికి కూడా ఉపశమనం అన్నారు.

మోడీ ప్రభుత్వం నిర్ణయంతో కోట్లాదిమందికి ఉపాధి

మోడీ ప్రభుత్వం నిర్ణయంతో కోట్లాదిమందికి ఉపాధి

మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట కలిగించింది. దీని వల్ల నిర్మాణ రంగం, గృహ కొనుగోలుదారులతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుంది. దేశంలో కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగాలకు ప్రధాన ఆధారం నిర్మాణ రంగం. నిర్మాణ రంగం ప్రగతిపై సిమెంట్, ఉక్కు, రంగులు, విద్యుత్ ఉపకరణాల పరిశ్రమలతోపాటు ఎన్నో ఇతర రంగాలు మనుగడ సాగిస్తాయి. అలాంటి నిర్మాణ రంగమే మందగమనంలో ఉంటే ఎన్నో ఇబ్బందులు. ఈ నేపథ్యంలో రియల్ రంగానికి ఊతమివ్వాలని మోడీ ప్రభుత్వం భావించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది ఉపాధికి ఊతమిచ్చే నిర్మాణ రంగానికి కేంద్రం ఉద్దీపనలను ప్రకటించడం ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చినట్లయింది. కేంద్రం నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్, నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ఇది కోట్లాదిమందికి ప్రయోజనం.

ఎన్పీఏలకు కూడా సాయం

ఎన్పీఏలకు కూడా సాయం

ఇదిలా ఉండగా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేని నిర్మాణ రంగ సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు చేయూత ఉంటుంది. మొండి బకాయిల్లో ఉన్న సంస్థలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంస్థలకు సాయం వర్తిస్తుంది. కానీ సానుకూల నికర విలువను కలిగి ఉండి, రెరాలో నమోదైన ప్రాజెక్టులకే ఈ సాయం ఉంటుంది. కేంద్రం ప్రకటించిన AIF నిధిని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్వహిస్తాయి. నిర్మాణాల కోసం దశలవారీగా నిధులు విడుదల అవుతాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here