మోదీని పక్కనబెట్టి.. మన్మోహన్‌కు ఆహ్వానం పంపుతున్న పాకిస్థాన్

0
2


జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ మండిపడుతోంది. ప్రధాని మోదీని పేరెత్తితేనే ఇమ్రాన్ ఖాన్ అంతెత్తున ఎగిరి పడుతున్నారు. ఏయ్.. మాతో పెట్టుకోవద్దు.. అణుయుద్ధం వస్తే.. ఇద్దరం నష్టపోతాం అంటూ ప్రగల్భాలకు పోతున్నాడు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభలో మోదీపై అక్కసునంతా వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రధానిని అవమానించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

భారత్, పాక్ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం పంపకుండా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానం పంపాలని ఇమ్రాన్ సర్కారు నిర్ణయించింది.

కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్ సింగ్‌ను అతిథిగా ఆహ్వానిస్తామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తెలిపారు. మన్మోహన్‌కు ఆహ్వాన పత్రం పంపుతామని ఆయన చెప్పారు.

Read Also: భారత్, పాక్ స్నేహవారధి.. కర్తార్‌పూర్ కారిడార్ ప్రత్యేకతలివే!

మన్మోహన్‌కు మతం పట్ల విశ్వాసం ఉంది, ఆయనంటే పాకిస్థాన్ అమితమైన గౌరవం. అందుకే ఆయనకు ఆహ్వానం పంపబోతున్నాం అని ఖురేషీ చెప్పారు.

గురు నానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్నారు. పాకిస్థాన్‌లోనని కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్‌లో గురునానక్ సమాధి ఉంది. దీన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌తో కలుపుతారు. పాకిస్థాన్‌లోని నరోవాల్ జిల్లాలో ఉన్నకర్తార్‌పూర్ కారిడార్‌కు భారత యాత్రికులు వీసా లేకుండానే వెళ్లే వీలు ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here