మోదీ విధానాలతో తీవ్ర నష్టం

0
0


మోదీ విధానాలతో తీవ్ర నష్టం

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో దేశానికి అన్నివిధాలుగా నష్టం జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని వాపోయారు. ఇకనైనా మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. సమావేశంలో సీనియర్‌ నాయకులు గడుగు గంగాధర్‌, తాహెర్‌ బిన్‌ హందాన్‌, విద్యాసాగర్‌రావు, మాజిద్‌, రామకృష్ణ, ముప్ప గంగారెడ్డి, పంచరెడ్డి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

8న ధర్నా
దేేశ ఆర్థిక పరిస్థితిపై నిరసనగా ఈ నెల 8న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపడుతున్నట్లు మోహన్‌రెడ్డి తెలిపారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్‌, మధుయాష్కీగౌడ్‌, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here