మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?

0
0


మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?

సిప్.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని గురించి మళ్లీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో పెద్దగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ గురించి కొద్దో గొప్పో అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇది బాగా చిరపరిచితం. అయితే అన్ని సార్లూ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కొన్ని వివరాలను మీకు ఆసక్తిగా అనిపించవచ్చు. అదేంటంటే.. ప్రతీ నెలా మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచో లేదా ఎన్.ఎస్.డి.ఎల్ నుంచో అందుకునే ఈమెయిల్ స్టేట్మెంట్.

సెబీ నిబంధనలు, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ (యాంఫీ) నిబంధనల తర్వాత ఈ రంగంలో పారదర్శకత మరింతగా పెరిగింది. దీంతో కొద్దికాలం నుంచి ప్రతీ నెలా నేషనల్ డిపాజిటరీస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎన్ఎస్‌డిఎల్‌) నుంచి మీకు ఈ మెయిల్ అందుతూ ఉంటుంది. అందులో సిప్ స్టేట్మంట్ పక్కాగా ఉంటుంది. ఏ ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారు, ఎంత మొత్తంలో డబ్బుంది, ఈ నెల మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బు డిడక్ట్ అయిందా లేదా.. వంటి అనేక వివరాలు ఉంటాయి.

వాటితో పాటూ..

సిప్ స్టేట్మెంట్‌లో ముఖ్యంగా మీ పేరు, ఫోలియో నెంబర్, కెవైసీ స్టేటస్, నామినీ పేరు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఉంటాయి. వీటితో పాటు ఐఎస్ఐఎన్(ISIN) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రతీ ఇన్వెస్టర్‌కూ అలాట్ చేస్తారు. అది కూడా ఉంటుంది. దీంతో పాటు యునిక్ క్లైంట్ కోడ్ (యూసిసి), ప్యాన్ వివరాలు కూడా ఉంటాయి. ఈ ప్రాధమిక సమాచారంతో పాటు మీరు పెట్టుబడి పెట్టిన తేదీ మొత్తం (సిప్ తేదీ), ఏ రోజు మీ ఖాతాలో నుంచి డబ్బు డెబిట్ అయింది, సదరు ఫండ్ ఎన్ఏవి (నెట్ అసెట్ వేల్యూ) వంటి వివరాలు ఉంటాయి.

అంతే కాదు సిప్ స్టేట్మెంట్‌లో మీరు పెట్టుబడి మొదలు పెట్టిన తేదీని కూడా రాస్తారు.

NAV లెక్క

NAV లెక్క

ప్రతీ నెలా మీ ఖాతాలో యూనిట్స్ జమవుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎన్ని యూనిట్స్ వచ్చాయో వివరాలు ఉంటాయి. ఎన్ఏవీ మొత్తంతో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని డివైడ్ చేసి వచ్చిన యూనిట్లను యాడ్ చేస్తారు. అంటే మీరు రూ.1000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ రూ.50 ఉందని అనుకుందాం. అప్పుడు 20 యూనిట్లు మీ ఖాతాలో జమవువుతాయి.

స్టేట్మెంట్‌లో ఏం తెలుసుకోవాలి

స్టేట్మెంట్‌లో ఏం తెలుసుకోవాలి

మీరు పెట్టుబడి పెడ్తున్న ఫండ్స్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయో లేదో తెలియజేయడానికి వాటి రిటర్న్స్ కూడా వివరిస్తారు. సగటు వార్షిక రాబడి రేటును ప్రచురిస్తారు. ఎంత రిటర్న్స్‌ను ఇస్తోందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అన్ని ఫండ్స్ బాగా పనితీరును కనబరుస్తూ.. ఇది అంతంతమాత్రంగా ఉంటే.. దాన్ని వదిలించుకోవాల్సిన టైం వచ్చిందేమో చూస్కోండి. అయితే నెలనెలా రాబడిని లెక్కించుకోకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా ఉంటుంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే పదేపదే తక్కువ రిటర్న్స్‌ను ఈ ఫండ్ ఇస్తే.. నిపుణుల సలహాతో వైదొలిగే ప్రయత్నం చేయండి.

ఇలా ప్రతీనెలా మీకు వచ్చే స్టేట్మెంట్‌ను చూసి మీ రిస్క్‌ను, రివార్డ్‌ను, ఫండ్స్ పనితీరును బేరీజు వేసుకుని ముందుకు సాగండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here