యజమానిని పీక్కు తినేసిన కుక్క, అస్థిపంజరం చూసి పోలీసులు షాక్!

0
0


కొద్ది రోజులుగా ఆ ఇంట్లో ఎలాంటి అలికిడి లేదు. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్ధురాలు కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇరుగు పొరుగువారు కూడా లేకపోవడంతో ఆ ఇంట్లో ఏం జరిగిందో కూడా బాహ్య ప్రపంచానికి తెలీదు. అయితే, ఆ వృద్ధురాలి క్షేమ సమాచారం తెలుసుకునే ఓ బంధువుకు మాత్రం అనుమానం కలిగింది. ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికెళ్లిన ఆమె.. ఆ వృద్ధు రాలి పరిస్థితి చూసి షాకైంది.

ఆమె పేరు శాలీ హనీచెక్, వయస్సు 80 ఏళ్లు. ఆమెకు తనవారంటూ ఎవరూ లేరు. వృద్ధాప్యంలోనూ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది. తీవ్రమైన పేదరికం, అనారోగ్యంతో ఆమె మంచాన్న పడింది. ఈ విషయం తెలిసి ఆమె పిన తల్లి కూతురు (కజిన్) లిండా కజ్మా అప్పుడప్పుడు ఆమెను కలిసి బాగోగులు చూసుకొనేది. చాలాసార్లు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చాలని కజ్మా ప్రయత్నించింది. అయితే, హనీ‌చెక్ మాత్రం తన పెంపుడు కుక్కను, ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లలేని చెప్పేది.

Also Read: యజమానిని తినేసిన పెంపుడు కుక్కలు.. మిస్సింగ్ మిస్టరీ వీడిందిలా!

హనీచెక్ కొద్ది రోజులుగా కజ్మా ఫోన్‌కు సమాధానం ఇవ్వడం లేదు. ఆమె చనిపోయిందనే అనుమానంతో ఇంటికెళ్లి చూసింది. లోపల గడియ పెట్టి ఉండటం, తలుపులు బద్దలకొట్టి వెళ్లింది. ఇల్లంతా వెతికినా ఆమె కనిపించలేదు. చివరికి వంట గది నుంచి తీవ్రమైన దర్గంధం వస్తుండటంతో అటుగా వెళ్లింది. అక్కడ కుర్చీలో అస్థిపంజరాన్ని చూసి షాకైంది. పుర్రెకు విగ్గు పెట్టినట్లు జుట్టు మాత్రమే మిగిలి ఉంది. ముఖం సగం వరకు కొరికేసినట్లు ఉంది. అది చూడగానే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది.

పోలీసులు అక్కడికి చేరుకుని అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో గదిలో అనారోగ్యంతో కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె పెంపుడు కుక్క రాట్వైలర్ జాక్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. శవ పంచనామాలో ఆమె శరీరాన్ని కొరికి తినేసినట్లు తెలిసింది. కుక్క, ఎలుకలు పీక్కుని తినేసినట్లు తేలింది. అయితే, ఆమె చనిపోయిన తర్వాతే అవి ఆమెను తిన్నాయని స్పష్టం చేశారు. ఆమెది సహజ మరణమేనని ధృవీకరించారు. ఈ ఘటన మిచిగన్‌లోని డెట్రాయిట్‌లో చోటుచేసుకుంది.
Photo credit (Dog): SplitShire/PexelsSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here