యాంకర్‌ ప్రదీప్‌ ఏమయ్యాడు..? ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు నిజమేనా?

0
2


ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు కొద్ది రోజులుగా షూటింగ్‌లకు హాజరు కావటం లేదు. గతంలో షూటింగ్‌లకు కొద్ది పాటి బ్రేక్‌ ఇచ్చిన ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో సందడి చేసేవాడు ప్రదీప్‌. కానీ ఈ సారి ఏకంగా నెల రోజుల పాటు బయటకు రాలేదు. దీంతో ప్రదీప్‌ ఆరోగ్య పరిస్ధితిపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి.

ప్రదీప్‌కు యాక్సిడెంట్‌ అయ్యిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు కూడా ప్రచారమయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రదీప్‌ స్పందించాడు. గురువారం తన సోషల్ మీడియా పేజ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. కొంతకాలంగా తనపై, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గురించి ఆలోచించి తనకు మెసేజ్‌లు, ఫోన్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రదీప్‌.
Also Read: అరుంధతి, శివగామి పాత్రలు ఒకే నటి చేయాల్సింది.. కానీ..!

అయితే మీడియాలో వస్తున్నట్టుగా ప్రదీప్‌ ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కేవలం షూటింగ్‌లో జరిగిన చిన్న సంఘటనలో ప్రదీప్‌ కాలికి గాయమైంది. ఆ తరువాత కూడా షూటింగ్‌లు కొనసాగించటంతో ఆ గాయం తీవ్రమై రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు నెల రోజుల పాటు ప్రదీప్‌ను నిలుచోవద్దని సూచించారు.
Also Read: ఆ సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వలేం.. వివాదాస్పద చిత్రంపై సుప్రీం కోర్ట్‌

దీంతో నెల రోజుల పాటు బెడ్‌కే పరిమితమైన ప్రదీప్‌ షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానన్న ప్రదీప్‌, మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపాడు. అయితే తనపై వచ్చిన నెగెటివ్‌ వార్తల విషయంలో కూడా హుందాగా స్పందించిన ప్రదీప్‌ను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఢీ జోడి లాంటి షోస్‌ చేస్తున్నాడు.
Also Read: `మీకు మాత్రమే చెప్తా` హీరో అందరికీ చెప్పేశాడు!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here