యాషెస్‌ తొలి టెస్టు: ఆస్ట్రేలియా ఆలౌట్‌.. పోరాడిన స్మిత్

0
0


బర్మింగ్‌హామ్‌: బౌలర్ల దూకుడు, బ్యాట్స్‌మెన్‌ పోరాటం మధ్య యాషెస్‌ సిరీస్‌ ఆసక్తిగా ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ పేసర్లు విజృంభించడంతో 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయడంతో.. ఆస్ట్రేలియా 284 పరుగులు చేసింది. అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడిన స్మిత్‌ చలవతో యాషెస్‌ తొలి టెస్టులో తొలి రోజును ఆసీస్‌ గౌరవంగానే ముగించింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/86), క్రిస్‌ వోక్స్‌ (3/58)లు చెలరేగారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టుతో ప్రారంభమయిన విషయం తెలిసిందే.

ఢిల్లీ విజయయాత్రకు కళ్లెం.. గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయం

టాపార్డర్‌ కకాలవికాలం:

టాపార్డర్‌ కకాలవికాలం:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆ నిర్ణయం ఎంత తప్పో తొందరలోనే తెలిసొచ్చింది. బాల్ ట్యాంపరింగ్‌ నిషేధం అనంతరం తొలిసారి టెస్టు ఆడుతున్న ఓపెనర్లు వార్నర్‌ (2), బాన్‌క్రాఫ్ట్‌ (8) పూర్తిగా నిరాశపర్చారు. పేసర్ బ్రాడ్‌ బుల్లెట్‌ బంతులకు నిలువలేక పెవిలియన్ చేరారు. మంచి ఫామ్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా (13)ను కూడా వోక్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 35 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది.

23 పరుగులు.. 5 వికెట్లు:

23 పరుగులు.. 5 వికెట్లు:

ఈ దశలో స్మిత్‌, ట్రావిస్ హెడ్‌ (61 బంతుల్లో 35; 5 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. లంచ్‌ సమయానికి ఆసీస్‌ 83/3తో నిలిచింది. లంచ్ అనంతరం హెడ్, వేడ్‌ (1)లను వోక్స్‌ వెంటవెంటనే ఔట్‌ చేసాడు. బ్రాడ్‌ కూడా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (5), ప్యాటిన్సన్‌ (0)లను పెవిలియన్ చేర్చాడు. ఇక కమిన్స్‌ (5)ను స్టోక్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి స్కోరు 122/8.

స్మిత్ సెంచరీ:

స్మిత్ సెంచరీ:

ఈ సమయంలో స్మిత్‌కు సిడిల్‌ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) తోడవ్వడంతో ఆసీస్ కోలుకుంది. ఏ జోడి 9వ వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఎట్టకేకలకు సిడిల్‌ను ఔట్‌ చేసి మొయిన్‌ అలీ.. ఈ భాగస్వామ్యాన్ని విడదీసాడు. లయన్‌ కూడా జోరుగా ఆడుతూ స్మిత్‌కు అండగా నిలిచాడు. దీంతో స్మిత్ సెంచరీ చేసి బ్యాట్‌ ఝళిపించాడు. పదో వికెట్‌కు 74 పరుగులు జోడించాక స్మిత్‌ ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులు చేసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. బర్న్స్‌ (4), జేసన్‌ రాయ్‌ (6) క్రీజులో ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here