యాషెస్‌ తొలి టెస్టు: స్మిత్, వేడ్‌ సెంచరీలు.. ఇంగ్లండ్‌ లక్ష్యం 398

0
2


బర్మింగ్‌హామ్‌: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (142; 207 బంతుల్లో 14×4) మరో సెంచరీతో అదరగొట్టగా, మాథ్యూ వేడ్‌ (110; 143 బంతుల్లో 17×4) కూడా సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌ ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఎట్టకేలకు బోణీ కొట్టిన పుణేరి పల్టన్‌.. హర్యానాకు తలైవాస్‌ షాక్

ఆదుకున్న మాజీ కెప్టెన్:

ఆదుకున్న మాజీ కెప్టెన్:

ఓవర్‌నైట్‌ స్కోరు 124/3తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియాను స్మిత్‌ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ఆధిక్యాన్ని పెంచుతూ పోయాడు. ఈ క్రమంలో ట్రావిస్‌ హెడ్‌ (51)తో కలిసి నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. హెడ్‌ నిష్క్రమణ అనంతరం స్మిత్‌కు వేడ్‌ నుంచి మంచి సహకారం లభించింది.

స్మిత్ సెంచరీ:

స్మిత్ సెంచరీ:

మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో లంచ్‌ సమయానికి ఆసీస్‌ 231/4తో మెరుగైన స్థితిలో నిలిచింది. 69 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన స్మిత్‌.. 147 బంతుల్లో సెంచరీ చేసాడు. మరోవైపు వేడ్‌ కూడా ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వేడ్‌తో కలిసి స్మిత్‌ నాలుగో వికెట్‌కు 126 పరుగులు జత చేశాడు.

ఇన్నింగ్స్‌ డిక్లేర్‌:

ఇన్నింగ్స్‌ డిక్లేర్‌:

ఈ సమయంలో స్మిత్‌ను వోక్స్‌ ఔట్‌ చేసినా.. అప్పటికే ఆసీస్‌ భారీ ఆధిక్యాన్ని సాధించింది. అయితే వేడ్‌ ఎల్బీగా ఔటైనా.. సమీక్షతో బయటపడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ టీమ్ పైన్‌ (34), ప్యాటిన్సన్‌ (47 నాటౌట్‌), కమిన్స్‌ (26 నాటౌట్‌) కూడా రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఇక 487/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది.

రెండో టీ20లో విజయం.. సిరీస్‌ భారత్‌దే

డ్రా చేసుకోవడమే సరైన దారి:

డ్రా చేసుకోవడమే సరైన దారి:

నాలుగో రోజు చివరికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (7), రాయ్‌ (6) క్రీజులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లండ్‌కు డ్రా చేసుకోవడమే సరైన దారి. ఎందుకంటే ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు ఛేదించడమే కష్టమే. చివరి రోజు ఇంగ్లండ్‌ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here