యాషెస్‌ సిరీస్‌లో పరుగుల ప్రవాహం.. మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి స్టీవ్‌స్మిత్‌ రీఎంట్రీ

0
1


మెల్‌బోర్న్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ మూడేళ్ల తర్వాత టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌లో పరుగుల ప్రవాహం పారించిన స్మిత్‌పై నమ్మకం ఉంచి ఆసీస్ జాయమాన్యం అతడికి టీ20 జాట్ట్టులో చోటు కల్పించింది. శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లతో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌లకు స్మిత్‌ను ఎంపిక చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయం తీసుకుంది.

టెస్టు ర్యాంకింగ్స్‌: 36 ర్యాంకులు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు రోహిత్‌.. టాప్‌-10లోకి అశ్విన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. ప్రపంచకప్-2019 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం జరిగిన యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ అద్భుత ఫామ్‌తో సత్తాచాటాడు. ఈ ప్రదర్శనతో శ్రీలంక, పాకిస్తాన్‌లతో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు స్మిత్‌ ఎంపికయ్యాడు. 2016 మార్చిలో చివరిసారి ఆసీస్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన స్మిత్‌.. దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే ప్రపంచకప్ టీ20కి ఏడాది పాటు మాత్రమే సమయం ఉండటంతో ఆసీస్‌ తమ ఆటగాళ్లను పరీక్షించే పనిలో పడింది, ఈ క్రమంలోనే పలువురు ఆటగాలకు అవకాశం కల్పించింది.

టీ20 ప్రపంచకప్ సొంత గడ్డపై జరుగనున్న తరుణంలో సీఏ ఆటగాళ్ల సత్తాకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనేస్టార్ ఆటగాడు స్మిత్‌ను టీ20 ఫార్మాట్‌లో ఎంపిక చేసింది. ఇక యాషెస్‌లో దారుణంగా విఫలమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా సీఏ చోటు కల్పించింది. వార్నర్ ఎప్పుడైనా చెలరేగే అవకాశం ఉండడంతో ఆసీస్ అతన్ని జాట్ట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను పక్కన పెట్టింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ను తప్పించి.. అష్టన్ టర్నర్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.

స్వదేశంలో అక్టోబర్‌ 27వ తేదీన శ్రీలంకతో తొలి టీ20 ఆరంభం కానుంది. లంకేయులతో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత టాప్‌ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌తో ఆసీస్‌ తలపడనుంది. ఈ టీ20 సిరీస్‌లకు అరోన్‌ ఫించ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏదేమైనా స్మిత్, వార్నర్ ఆసీస్ తరపున సత్తా చాటుతున్నారు.

Australia T20 squad:

Aaron Finch (captain), Ashton Agar, Alex Carey, Pat Cummins, Glenn Maxwell, Ben McDermott, Kane Richardson, Steve Smith, Billy Stanlake, Mitchell Starc, Ashton Turner, Andrew Tye, David Warner, Adam Zampa.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here