యాషెస్: ఇంగ్లాండ్ 374 ఆలౌట్: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 90

0
0


హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 135.5 ఓవర్లకు గాను 374 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 267/4తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 107 పరుగులు జోడించి మిగితా వికెట్లను కోల్పోయింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్స్(133 పరుగులు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లయాన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

1
44038

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్(144) సెంచరీ సాధించాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here