యువతి అపహరణ

0
2


యువతి అపహరణ

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌

ధర్పల్లి, న్యూస్‌టుడే: పొలంలో పశువులు మేపుతున్న యువతిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తల్లితో కలిసి పశువులను మేపడానికి గ్రామ చెరువు సమీపంలోకి వెళ్లింది. మధ్యాహ్న భోజనం చేయడానికి తల్లి పొలాల వైపునకు వెళ్లగా..యువతి రోడ్డుపై ఉంది. దుబ్బాక నుంచి ధర్పల్లికి కారులో వెళ్తున్న దుండగులు యువతిని బలవంతంగా తీసుకెళ్తుండగా తల్లి గమనించింది. ఆమె రోడ్డుపైకి వచ్చేసరికే వారు వెళ్లిపోయారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సీసీ కెమెరాల్లోని మూడు కార్లని గుర్తించాం… ప్రత్యేక బృందంతో విచారిస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమీప గ్రామాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా మూడు కార్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. . రాత్రి వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు.

సీసీ టీవీ ఫుటేజీని చూస్తున్న ఏసీపీ

ధర్పల్లి ఘటనతో అప్రమత్తం

నిజామాబాద్‌ నేరవార్తలు: ధర్పల్లి మండల పరిధిలో యువతి అపహరణ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ప్రత్యేకించి ఓ కారులో యువతిని అపహరించారన్న సమాచారంతో అన్నిరకాల కార్లను నిలిపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here