యూట్యూబ్ దుమ్ముదులుపుతోన్న ‘సరైనోడు’.. బన్నీ ది కింగ్!

0
0


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నారు. తన నటన, డ్యాన్సులతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సరైనోడు’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ప్రేక్షకులకు చూపించారు. అల్లు అర్జున్ హీరోయిజం, ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజం సినిమాకు ప్రధాన బలాలు. ఈ సూపర్ హిట్ సినిమా హిందీ అనువాద హక్కులను బాలీవుడ్‌కు చెందిన గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలోకి అనువాదం చేసి ‘సరైనోడు’ టైటిల్‌తోనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

2018 డిసెంబర్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన తొలి ఇండియన్ మూవీ ఇదేనని (సరైనోడు హిందీ) అంటున్నారు. అలాగే, అత్యధిక మంది లైక్ చేసిన భారతీయ చిత్రం కూడా ఇదే. వాస్తవానికి అల్లు అర్జున్ హిందీ అనువాద చిత్రాలకు యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకు కూడా 150 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన అల్లు అర్జున్ టాప్ 10 హిందీ అనువాద చిత్రాలు
1. సరైనోడు – 200 మిలియన్
2. దువ్వాడ జగన్నాథం – 152 మిలియన్
3. రుద్రమదేవి – 75 మిలియన్
4. సన్ ఆఫ్ సత్యమూర్తి – 58 మిలియన్
5. ఆర్య 2 – 47 మిలియన్
6. రేసుగుర్రం – 45 మిలియన్
7. హ్యాపీ – 33 మిలియన్
8. జులాయి – 32 మిలియన్
9. ఇద్దరమ్మాయిలతో – 29 మిలియన్
10. గంగోత్రి – 22 మిలియన్Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here