యూపీఐకి పండగల కిక్కు.. అక్టోబర్ లో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయంటే ?

0
2


యూపీఐకి పండగల కిక్కు.. అక్టోబర్ లో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయంటే ?

పండగల సీజన్లో డిజిటల్ లావాదేవీలు భారీ ఎత్తున పెరిగాయి. ఇందుకు నిదర్శనమే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పీసిఐ) వెల్లడించిన గణాంకాలు. అక్టోబర్ నెలలో ఎన్ పీ సీఐ తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ (యూపీఐ) లావాదేవీలు ఏకంగా వందకోట్లు దాటి 115 కోట్లకు చేరుకున్నాయి. ఇంతకు ముందు సెప్టెంబర్ నెలలో 96 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ లో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ రూ.1.91 లక్షల కోట్లు ఉండగా.. అంతకు ముందు నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.1.61 లక్షల కోట్లుగా నమోదయిందని ఎన్ పీ సి ఐ వెల్లడించింది.

యూపీఐ ఆధారితంగా బ్యాంకులతో పాటు థర్డ్ పార్టీ కంపెనీలు కూడా యాప్ లను తీసుకువచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి.

యూపీఐ వినియోగాన్ని పెంచేందుకు గాను పీ2పీఎంతో పాటు తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అప్లికేషన్ కు చెల్లింపులు చేసే సదుపాయాన్ని కలిపించింది.

ఏడాదిలో ఎన్నంటే…

* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో యూపీఐ ఆధారిత లావాదేవీలు 535 కోట్లుగా నమోదయ్యాయి.

* 2017-18 సంవత్సరంలో లావాదేవీలు 91.52 కోట్లుగా ఉన్నాయి.

* యూపీఐ ద్వారా నగదును విభిన్న బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేయవచ్చు.

* 141కి పైగా బ్యాంకులు యూపీఐ ని వినియోగిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఈ- వాలెట్లకు యూపీఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

* పే టీఎం, గూగుల్ పే, ఫోన్ వంటి యాప్ లు యుపీఐని వినియోగించుకుంటున్నాయి.

విదేశీ విస్తరణ

* దేశీయంగా యుపీఐకి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లోనూ యూపీఐ ని వినియోగించుకునేందుకు ఎన్ పీ సి ఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ లో యూపీఐ ని వియోగించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

* ఇప్పటికే ఈ రెండు దేశాలు రూపే కార్డులను అనుమతిస్తున్నాయి. యూపీఐ చెల్లింపులను కూడా అనుమతిస్తే భారత పర్యాటకులు డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది. మన దేశం నుంచి ఈ దేశాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి యూపీఐని ఈ దేశాల్లో అందుబాటులోకి తెస్తే సులభంగా చెల్లింపులు చేయడానికి ఆస్కారం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here