యూరియా కొరతతో అవస్థలు

0
6


యూరియా కొరతతో అవస్థలు


యూరియా కోసం వరుసలో నిలబడిన రైతులు

గాంధారి, న్యూస్‌టుడే: మండలంలో మూడు రోజుల నుంచి యూరియా కొరత నెలకొంది. ప్రైవేటు ఎరువుల దుకాణల ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా లారీ వచ్చినా కొందరికి దొరికి, మరికొందరికి లభించకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. మంగళవారం పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద వందల మంది రైతులు యూరియా బస్తాల రశీదుల కోసం ఉదయం నుంచి వరుసలో నిల్చున్నారు. రెండు లారీల్లో 900 బస్తాలు రాగా అన్నదాతలు ఎగబడ్డారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఐదు బస్తాలు మాత్రమే ఇస్తున్నట్లు పీఏసీఎస్‌ కార్యదర్శి మోహన్‌రెడ్డి తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here