యూరియా కొరతపై ఆందోళన చెందొద్దు

0
4


యూరియా కొరతపై ఆందోళన చెందొద్దు

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ అన్నారు. భీమ్‌గల్‌ పట్టణంలోని రైతు సేవా సహకార సంఘాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాకు ఈ సీజను పంట కాలానికి 60వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకు అన్ని సొసైటీలు, ప్రైవేటు డీలర్లకు 58వేల మెట్రిక్‌ టన్నులు అందజేశామన్నారు. ఈ సీజన్‌లో అన్నదాతలు ఎక్కువ మోతాదులో యూరియాను వాడటం వల్ల తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు ఒక ఎకరాకు వంద కేజీల యూరియా మాత్రమే వాడాలని సూచించారు. ఎరువు రవాణాలో జరిగిన జాప్యం వల్లనే పంపిణీ సకాలంలో జరగలేదన్నారు. శాఖ నిజామాబాద్‌ సహాయ సంచాలకులు వెంకట రవీందర్‌, ఏవో సంజీవ్‌కుమార్‌, ఏఈవోలు లక్‌పతి, అరవింద్‌, కార్యదర్శి అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here