యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

0
4


యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ఎస్పీ శ్వేత

ఆసనాలు వేస్తున్న విద్యార్థులు, వేదికపై ఎస్పీ శ్వేత తదితరులు

కామారెడ్డి క్రీడా విభాగం, న్యూస్‌టుడే: యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. కామారెడ్డి సరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులకు బాల్యం నుంచే యోగా సాధన చేయించాలని తద్వారా ఒత్తిడి దూరమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజయ్య, అంజయ్యగుప్తా, అనిల్‌రెడ్డి, సత్యనారాయణ, సిద్దాగౌడ్‌, బాలరాజు, రాజు, సిద్ధరాములు, ఎల్లయ్యలు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

జిల్లాస్థాయి యోగా పోటీల్లో బాలబాలికల విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

8-14 బాలికల విజేతలు : ప్రథమస్థానం: శ్రీదేవి(కేజీవీబీ, మాచారెడ్డి), ద్వితీయ: స్వర్ణలత(కేజీవీబీ, మాచారెడ్డి), తృతీయ: పుష్పలత(కేజీవీబీ, మాచారెడ్డి)

8-14 బాలుర విజేతలు : ప్రథమ స్థానం: సాకేత్‌(ఆర్కిడ్స్‌ ఉన్నతపాఠశాల), ద్వితీయ: అరవిందర్‌సింగ్‌(శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల), తృతీయ: ఉమాపతి (ప్రోబెల్స్‌ ఉన్నత పాఠశాల)

15-20 బాలికలు : ప్రథమ: లావణ్య(కేజీవీబీ, మాచారెడ్డి), ద్వితీయ: దీపిక(కేజీవీబీ, మాచారెడ్డి), తృతీయ: మౌనిక(కేజీవీబీ, మాచారెడ్డి)

15-20 బాలురు : ప్రథమస్థానం: నివాస్‌(వశిష్ట డిగ్రీ కళాశాల కామారెడ్డి), ద్వితీయ: గంగాధర్‌ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి), తృతీయ: బాలరాజు(ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, లింగంపేట)Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here