రక్షాబంధన్ రోజు స్వీట్స్, చాక్లెట్స్ ఇస్తున్నారా.. ఒక్కనిమిషం ఆగండి!!

0
0


రక్షాబంధన్ రోజు స్వీట్స్, చాక్లెట్స్ ఇస్తున్నారా.. ఒక్కనిమిషం ఆగండి!!

రేపే (ఆగస్ట్ 15) రక్షాబందన్. ప్రతి సోదరి, సోదరుడు తమ మధ్య ఉన్న ఆప్యాయతను ప్రత్యేకంగా గుర్తు చేసుకునే రోజు. తనకు అండగా ఉండాలని అక్క లేదా చెల్లి తన సోదరుడికి రాఖీ కడుతుంది. అతని నోటిని తీపి చేస్తుంది. అందుకు అతను కూడా తన సోదరికి డబ్బుల రూపంలో లేదా ఇతర రూపాల్లో బహుమతులు ఇస్తారు. ఈ రక్షాబంధన్ రోజు మీ తోబుట్టువులకు ప్రత్యేక బహుమతులు ఇలా ఇవ్వండి… సంప్రదాయంగా రాఖీ కడుతూ, నోటిని తీపి చేస్తూనే, అధిక ఖర్చుతో టెంపరరీ బహుమతులు కాకుండా వారికి ఉపయోగపడేలా మంచి బహుమతులు ఎంచుకోండి.

హెల్త్ ఇన్సురెన్స్

మీ తోబుట్టువు మీపై ఆధారపడి ఉంటే మీరు వారిని మీ సొంత హెల్త్ ఇన్సురెన్స్ స్కీం కిందకు తీసుకురావొచ్చు. ఇందుకు సంబంధించి మీ ఇన్సురెన్స్ సంస్థ నుండి వివరాలు తెలుసుకోండి. హెల్త్ ఇన్సురెన్స్ అనేది ఎంతో అవసరం. చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఆసుపత్రికి వెళ్తే వేలు ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఆర్థికంగా కుంగదీస్తుంది. ఈ నేపథ్యంలో మీ తోబుట్టువుకు హెల్త్ కవరేజ్ లేకుంటే, మీపై ఆధారపడుతూ మీ ఫ్యామిలీ కవరేజ్‌లో లేకుంటే ఇది వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మీపై ఆధారపడి లేకపోయినప్పటికీ ఈ హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు చేసేందుకు ఆ మొత్తాన్ని వారికి బహుమతిగా ఇవ్వండి.

టర్మ్ ప్లాన్

టర్మ్ ప్లాన్

రక్షాబంధన్ అంటేనే తోబుట్టువులు ఒకరికి మరొకరు అని అర్థం. ఆర్థిక భద్రత ప్రస్తుత కాలంలో అతిపెద్ద సెక్యూరిటీ. మీపై ఆధారపడేవారికి ఈ రాఖీ పండుగ రోజు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఆర్థిక భద్రత కోసం టర్మ్ ఇన్సురెన్స్ ముఖ్యమైనది. మీ ప్రస్తుత వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 20 రెట్లు ఎక్కువ మొత్తం హామీని లక్ష్యంగా పెట్టుకోండి. అనుకోకుండా మరణం వంటి పెను ప్రమాదం సంభవిస్తే ఇది ఆర్థికంగా భరోసా ఇస్తుంది. తోబుట్టువులకు టర్మ్ కవరేజ్ లేకుంటే దానిని తీసుకోమని పట్టుబట్టండి. మరో విషయం ఏమంటే ఇది అత్యంత చౌకైన ప్లాన్. మీ కుటుంబానికి ఆర్థిక భరోసా, మనస్శాంతిని కలిగిస్తుంది.

ఇన్వెస్ట్‌మెంట్ ఖాతా తెరవండి

ఇన్వెస్ట్‌మెంట్ ఖాతా తెరవండి

మీ తోబుట్టువుకు పెట్టుబడిపై అవగాహన లేకుంటే మీరు వారికి ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ తెరిపించండి. భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకునే వారికి, పదవీ విరమణ సమయంలో ఏమైనా లక్ష్యాలు ఉంటే వాటిని దరి చేర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డీమాట్ అకౌంట్ తెరిచేందుకు సహాయపడండి. వారికి మ్యుచువల్ ఫండ్స్ పైన ఆసక్తి ఉంటే SIP ఖాతాను తెరిచేందుకు సహకరించండి. ఒకవేళ వారు రిస్క్ తీసుకోవడానికి విముఖత చూపిస్తూ, కచ్చితమైన రాబడికి మొగ్గు చూపితే PPF, సుకన్య సమృద్ధి యోజన వంటికి సహకరించండి. వీటిల్లో పెట్టుబడికి రాఖీ బంధన్ సందర్భంగా తొలి ఇన్వెస్ట్ మీరే ఇచ్చి ప్రారంభించండి. ఇది వారికి పన్నురహితం కూడా.

వారి రుణం తీర్చండి

వారి రుణం తీర్చండి

మీ తోబుట్టువులు కనుక రుణాల్లో ఉంటే మీకు సాధ్యమైనంత వారి రుణం తీర్చి రాఖీ బంధన్ రోజు మీ బంధం ఎంత బలమైనదో తెలియజేయండి. ఈఎంఐ ద్వారా లేదా కొంత మొత్తం చెల్లించడం ద్వారా సహకరించవచ్చు. మీ తోబుట్టువు ఈఎంఐలు చెల్లిస్తుంటే అదనపు ఈఎంఐ ద్వారా వారికి వడ్డీ రేటు భారం తగ్గుతుంది.

చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ కాదు.. ఇవి ఇవ్వండి

చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ కాదు.. ఇవి ఇవ్వండి

సాధారణంగా రక్షాబంధన్ రోజు ఇంట్లో చేసిన ఆహార పదార్థంతో నోటిని తీపి చేస్తారు. దీంతో పాటు ఖరీదైన చాక్లెట్స్, పర్‌ఫ్యూమ్స్ వంటివి ఇస్తుంటారు. అయితే ఇవి టెంపరరీ. వారికి ఎప్పటికీ ఉపయోగపడేలా వెండి, బంగారం వంటి విలువైన లోహాలు బహుమతిగా ఇవ్వండి. టైమ్ గడిచినా కొద్ది వీటి విలువ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ మ్యుచువల్ ఫండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here