రగ్బీ జట్టు కోసం ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు ఏంచేశారంటే!!

0
0


లండన్: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రముఖ సిరీస్‌ల్లో యాషెస్‌ ఒకటి. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లు తలపడే ఈ సిరీస్‌ కోసం ఇరు జట్ల అభిమానులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఈ సిరీస్ మొదటి టెస్టులో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయడంతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్లు రెండో టెస్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.

కార్డిఫ్ పురుషుల జట్టు కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

లార్డ్స్‌ వేదికగా బుధవారం ఇంగ్లండ్‌-ఆసీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడానికి ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ సిద్ధంగా ఉన్నాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు జేమ్స్‌ అండర్సన్‌ దూరం కావడంతో ఆర్చర్‌ ఎంపిక ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే టెస్ట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెండో టెస్టు కోసం లార్డ్స్ మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్‌లో బ్యాటింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కెప్టెన్ జో రూట్ నెట్‌లో చమటోసుస్తున్నాడు.

మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ అనంతరం తమ రగ్బీ జట్టు కోసం జరిగిన వీడియో చిత్రీకరణలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. రగ్బీ ఆటకు మరింత ఆదరణ లభించడం కోసం ఆసీస్ బృందం వీడియో చిత్రీకరణలో పాల్గొంది. ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ మధ్యలో కూర్చుని రగ్బీ బంతిని పట్టుకున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here