రన్‌వేపై పడ్డ ఇంధనం.. ఆ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం

0
3

పనాజీ: గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రెండు గంటల పాటు విమానాశ్రయ సేవలు నిలిపివేయడం జరిగింది. నేవీకి చెందిన యుద్ధ విమానంనుంచి ఇంధనం రన్‌వేపైకి పడిపోవడంతో విమాన సర్వీసులను రెండుగంటల పాటు రద్దు చేయడం జరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మిగ్ – 29 కే నుంచి ఇంధనం రన్‌వేపై పడిపోవడంతో చిన్నగా మంటలు చెలరేగాయి. యుద్ధ విమానం టేకాఫ్ అయిన సమయంలో ఈ ఇంధనం రన్‌వేపై పడిందని నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ చెప్పారు. దీంతో రన్‌వేపై ల్యాండ్ అయ్యే విమానాలు, టేకాఫ్ అవ్వాల్సిన విమానాలకు అంతరాయం కలిగింది. ఇక ఇంధనం పడిపోవడంతో విమాన సేవలకు అంతరాయం కలిగిందని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నామంటూ ఎయిర్‌పోర్ట్ అధికారులు ట్విటర్ చేశారు.

రన్‌వేపై అగ్ని చెలరేగిన వెంటనే నేవీ సిబ్బంది రన్‌వేపైకి చేరుకుని మంటలు ఆర్పేశారని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ఇక రన్‌వేపై ఉన్న ఇంధనంను నేవీ సిబ్బంది క్లీన్ చేశారు. ఇక ధ్వంసమైన రన్‌వేను కూడా మరమత్తులు చేశారు. ఇక యుద్ధ విమానాల్లో ఇంధనం ట్యాంకులు బయట ఉంటాయని, ఇలా ఉండటం వల్ల సుదూర ప్రాంతాలకు ఇవి ప్రయాణించగలవని నేవీ అధికారులు తెలిపారు. ఇక ఈ విమానాశ్రయం భారత నేవీ నిర్వహణలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here