రమణీయం వేంకటేశ్వరస్వామి కల్యాణం

0
0


రమణీయం వేంకటేశ్వరస్వామి కల్యాణం


వేంకటేశ్వరస్వామి కళ్యాణం జరుపుతున్న పండితులు

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: చేంగల్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం మధ్య భూదేవి, లక్ష్మీదేవితో శ్రీవారి వివాహం జరిపారు. అంతకు ముందు ఆనవాయితీ ప్రకారం.. మంగళసూత్రాలను ఆస్థాన విశ్వబ్రాహ్మణుల ఇంటి నుంచి ఆలయం వరకు మంగళహారతులు, వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం రథభ్రమణం చేపట్టారు. పూలతో అలంకరించిన రథాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఏటా కార్తీక మాసంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఎంపీపీ ఆర్మూర్‌ మహేష్‌, వైస్‌ ఎంపీపీ చింతకింది భూమేశ్వర్‌, బావాయి, సర్పంచి కట్కం గంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here