రామ్ ‘రెడీ 2’.. హింట్ ఇచ్చిన జెనీలియా భర్త!

0
2


‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెనీలియా డిసౌజా.. ‘బొమ్మరిల్లు’ సినిమాతో అందరి మనసులు గెలుచుకున్నారు. తెలుగులో 15కు పైగా సినిమాలు చేసిన జెనీలియా కెరీర్‌లో ‘రెడీ’ ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లోనూ ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోందట. ఈ విషయాన్ని జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ సూచన ప్రాయంగా చెప్పారు.

2012లో రితేష్‌ను పెళ్లాడిన తరవాత జెనీలియా తెలుగులో నటించలేదు. తన భర్త మరాఠ సినిమాలోనే అతిథి పాత్ర పోషించారు. రెండు హిందీ చిత్రాల్లోనూ అతిథి పాత్రల్లో మెరిశారు. సోమవారం జెనీలియా 32వ ఏట అడుగుపెట్టారు. తన పుట్టినరోజు వేడుకను భర్త రితేష్ దేశ్‌ముఖ్, హీరో రామ్ సమక్షంలో జెనీలియా జరుపుకున్నారు. ఈ ఫొటోలను రితేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో జెనీలియా, రామ్ నవ్వుతూ కనిపించారు. రితేష్ మాత్రం స్టైలిష్ మాస్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

Also Read: బెల్లంకొండ సినిమాలో రేణు దేశాయ్.. హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న నటి!

‘‘ఇస్మార్ట్ శంకర్ రామ్, వెరీ స్మార్ట్ జెనీలియాతో ఇస్మార్ట్ రితేష్ దేశ్‌ముఖ్. ఈ సాయంత్రాన్ని ఎంతో ప్రత్యేకం చేసిన రామ్‌కు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే జెనీలియా’’ అని తన పోస్ట్‌లో రితేష్ పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆయన చేసిన రెండో పోస్ట్ చర్చకు దారితీసింది. కేవలం రామ్, జెనీలియా ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘‘రెడీ 2 ఆల్‌రెడీ’’ అని పేర్కొన్నారు. దీంతో ‘రెడీ’ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. నిజంగా వస్తుందా అంటూ కామెంట్లు మొదలుపెట్టారు.

రితేష్ సరాదాగా పేర్కొన్నారో.. లేదంటే నిజంగానే మళ్లీ జెనీలియా, రామ్ కలిసినస్తున్నారో తెలీదు కానీ ప్రస్తుతానికి అయితే ఈ వార్త వైరల్‌గా మారింది. 2008లో వచ్చిన ‘రెడీ’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. చూద్దాం మరి ‘రెడీ 2’ నిజంగా వస్తుందో లేదో!

View this post on Instagram

#ISmart @riteishd with #ISmartShankar @ram_pothineni & the very smart @geneliad – thank you Ram for making this evening special. #HappyBirthdayGenelia

A post shared by Riteish Deshmukh (@riteishd) on

View this post on Instagram

READY 2 Already !!!! @geneliad @ram_pothineni

A post shared by Riteish Deshmukh (@riteishd) on

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here