రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని కొనుగోలు చేయడానికి 5 కారణాలు!

0
6


రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని కొనుగోలు చేయడానికి 5 కారణాలు!

క్వింటెసెన్షియల్ డిజైన్, కమాండింగ్ రోడ్ ప్రెసెన్స్, అసాధారణ విశ్వసనీయత కలిగి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధర. బుల్లెట్ 350 KS రూ.1.12 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) కాగా బుల్లెట్ 350 ఈఎస్ రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 KS మరియు ES 350CC, ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, ట్విన్ స్పార్క్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ లోడ్ సామర్థ్యం ఎక్కువ.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని కొనాలా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే బుల్లెట్ 350ని లాంచ్ చేసింది. 6 కొత్త రంగుల్లో దీనిని తీసుకు వచ్చింది. 3 కిక్ స్టార్ట్ (KS) వేరియంట్, అంతే సంఖ్యలో ఎలక్ట్రిక్ స్టార్ట్ (ES) ట్రిమ్స్‌తో వచ్చింది. తాజా రంగులతో పాటు కొత్త ధరలతో వచ్చాయి. ఫేమస్ మోటర్ సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒకటి. కాలేజీకి వెళ్లేవాళ్లు అయినా, ఆఫీస్‌లకు వెళ్లేవాళ్లు అయినా.. అందరూ ఈ బైక్‌ను ఇష్టపడతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని ఎందుకు కొనాలో తెలుసుకుందాం…

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇంజిన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇంజిన్

పవరింగ్ బుల్లెట్ 350 KS మరియు ES 350CC, ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, ట్విన్ స్పార్క్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 5 స్పీడ్ కాన్‌స్టెంట్ మెష్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్పెసిఫికేషన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్పెసిఫికేషన్స్

ఈ బైక్ అద్భుతమైన లోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ తక్కువగా లేదా మొత్తానికే ఉపయోగించని మోటార్ సైకిల్. సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్‌తో 19 ఇంచుల టైర్లు కలిగి ఉంటుంది. ముందు భాగంలో 280mm డిస్క్, వెనుకవైపు 153mm డ్రమ్ కలిగి ఉంది. KS, ES వేరియంట్స్ సింగిల్ చానల్ ఏబీఎస్‌తో వచ్చాయి. ఈ అన్ని స్పెసిఫికేషన్ల సమ్మేళనం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350. ఇది మీ ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 క్వింటెసెన్షియల్ డిజైన్, కమాండింగ్ రోడ్ ప్రెసెన్స్ బైక్. Bullet 350 KS ధర రూ.1.12 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. Bullet 350 ES ధర రూ.1.27 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కలర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కలర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని మీకు నచ్చిన (ఉన్న వాటి నుంచి) రంగుల్లో తీసుకోవచ్చు. ఇదివరకు కలర్స్ ఆప్షన్ లేని సమయం ఉంది. ఇదివరకు కేఎస్ వేరియంట్ బ్లాక్ పేయింట్ స్కీమ్ మాత్రమే ఉంది. ఇప్పుడు దీనికి మరో అదనంగా వచ్చాయి. బుల్లెట్ సిల్వర్, షాపైర్ బ్లూ, ఒనిక్స్ బ్లూ కలర్స్‌లలో ఉన్నాయి. మరోవైపు ఈఎస్ వేరియంట్ జెట్ బ్లాక్, రీగల్ రెడ్, రాయల్ బ్లూ వంటి కలర్స్‌లలో కూడా లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 యాక్సెసరీస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 యాక్సెసరీస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 యాక్సెసరీస్ విషయానికి వస్తే పలు ఉపకరణాలు ఉన్నాయి. ఇంజిన్ గార్డ్‌లో పలు ఎంపికలు ఉన్నాయి. మీరు టూరింగ్ డ్యూయల్ సీటు స్థానంలో కన్వెన్షనల్ సీటును ఎంచుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here