రాష్ట్రంలో పరిపాలన స్తంభించింది

0
5


రాష్ట్రంలో పరిపాలన స్తంభించింది


సమావేశంలో మాట్లాడుతున్న బండారు దత్తాత్రేయ, చిత్రంలో రాష్ట్ర, జిల్లా నేతలు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని, ఏ శాఖల్లో చూసినా అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెరాస అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో కర్షకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. తక్షణమే అన్నదాతలను ఆదుకొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం దూరదృష్టితో చేపట్టిన ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకు న్యాయం చేశారని, రానున్న రోజుల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కానుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒక సీటు గెలిచినప్పటికీ.. ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించటం గొప్ప విషయమన్నారు. తమ పార్టీ ఎదగటం చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తమదేనని పేర్కొన్నారు. జిల్లాలో ఇదివరకు 70వేల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి లక్షకు పైగా సభ్యత్వాలు చేయించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లాధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, సీనియర్‌ నేతలు విజయ రామారావు, ప్రేమేందర్‌ రెడ్డి, జిల్లా నాయకులు లోక భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, యెండల సుధాకర్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here