రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

0
1


రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

మంచిర్యాల క్రీడావిభాగం, న్యూస్‌టుడే: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 65వ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఉమ్మడి పదిజిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి రోజివరకుమారి అధ్యక్షతన స్థానిక ఖండేల్‌వాల్‌ భవనంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అండర్‌-14 బాలబాలికల విభాగంలో సుమారు 150 మంది విద్యార్థులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొదటిరోజు జరిగిన పోటీలు ఉత్కంఠగా సాగాయి. అంతకుముందు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేదుకు చదరంగం దోహదపడుతుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చి విజయం సాధించిన క్రీడాకారులు త్వరలో కోల్‌కత్తాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని నిర్వాహకులు సుకుమార ఫ్రాన్సిస్‌, సంతోష్‌ తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించామన్నారు. పోటీలు ఈ నెల 4 వరకు కొనసాగుతాయన్నారు. ఒక్కో విద్యార్థికి అయిదు రౌండ్లు ఉంటాయన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here