రాష్ట్రస్థాయి త్రోబాల్‌ పోటీలు ప్రారంభం

0
1


రాష్ట్రస్థాయి త్రోబాల్‌ పోటీలు ప్రారంభం

మార్చిఫాస్ట్‌ నిర్వహిస్తున్న నిజామాబాద్‌ క్రీడాకారులు

జన్నారం, న్యూస్‌టుడే : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్రస్థాయి అండర్‌-14 బాల, బాలికల త్రోబాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఆటగాళ్ల గౌరవ వందనాన్ని అతిథులు స్వీకరించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. అన్నీ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 27, 28, 29 మూడు రోజుల పాటు పోటీలను నిర్వహించనున్నారు. పోటీలలో భాగంగా నల్గొండ-ఆదిలాబాద్‌ జట్లు షో మ్యాచ్‌ నిర్వహించాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి రోజీ వరకుమారి, ఎంపీపీ సరోజినిరవీందర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌, పొనకల్‌ సర్పంచి జక్కు భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజు తలపడిన జట్లు ఇవే..

తొలిరోజున పూల్‌-ఏ బాలికల్లో వరంగల్‌-నల్గొండ జట్లు తలపడగా వరంగల్‌ జట్టు గెలుపొందింది. ఖమ్మం- కరీంనగర్‌ జట్లలో ఖమ్మం, నల్గొండ-రంగారెడ్డి జట్లలో రంగారెడ్డి, వరంగల్‌-కరీంనగర్‌లో వరంగల్‌ జట్టు గెలుపొందాయి. పూల్‌-బి విభాగంలో హైదరాబాద్‌-ఆదిలాబాద్‌ జట్లు తలపడగా హైదరాబాద్‌ జట్టు, నిజామాబాద్‌-మహబూబ్‌నగర్‌ జట్లు పోటీ పడగా నిజామాబాద్‌ జట్టు గెలుపొందింది. పూల్‌-ఏ బాలుర విభాగంలో రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జట్లు తలపడగా రంగారెడ్డి, నిజామాబాద్‌-నల్గొండ జట్లు పోటీ పడగా నిజామాబాద్‌, రంగారెడ్డి-ఖమ్మం జట్లలో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. పూల్‌-బిలో కరీంనగర్‌-ఆదిలాబాద్‌ తలపడగా కరీంనగర్‌, వరంగల్‌- హైదరాబాద్‌ పోటీ పడగా హైదరాబాద్‌ జట్టు గెలుపొందినట్లుగా నిర్వాహకులు తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here