రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

0
0


రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక


బాలుర జట్టు క్రీడాకారులతో నాయకులు

కిసాన్‌నగర్‌(బాల్కొండ) న్యూస్‌టుడే: ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ముప్కాల్‌లో నిర్వహించనున్న అండర్‌ 18 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే బాలుర, బాలికల జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. ఈ క్రీడాకారులకు కిసాన్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తెరాస నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు దాసరి వెంకటేష్‌, ఖోఖో అసోసియేషన్‌ జిల్లా ఛైర్మన్‌ సంతోష్‌, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

బాలుర జట్టు : అర్వింద్‌, బలరాం, పవన్‌, కృష్ణ, చందు, తరుణ్‌, అశోక్‌, మణికంఠ, ఈశ్వర్‌, భానుప్రకాష్‌, రోహిత్‌, గోవింద్‌లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా గురుస్వామి, సాయితేజను ఎంపిక చేశారు. కోచ్‌గా శ్రీకాంత్‌, సాయిబాబా కొనసాగనున్నారు.

బాలికల జట్టు : సంధ్య, సృజన, శిరీష, మనీషా, గంగనర్సు, శ్రీదేవి, దీపిక, తాయి, మనీషా, హిమబిందు, నిఖిత, చిన్నవిని ఎంపిక చేశారు. స్టాండ్‌బైగా నవ్య, పావనీలు ఎంపికయ్యారు. కోచ్‌గా గంగారెడ్డి, స్రవంతి కొనసాగనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here