రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

0
1


రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

పతకాలు సాధించిన క్రీడాకారులతో శిక్షకుడు ఎండీ ఉమేర్‌

నిజామాబాద్‌ క్రీడావిభాగం : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేశామని జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అతిఖుల్లా, విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో సోమవారం ఎంపికలను నిర్వహించారు. పురుషుల విభాగంలో 80 మంది క్రీడాకారులు, మహిళల విభాగంలో 55 మంది హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 21 నుంచి 23 వరకు వరంగల్‌లో జరిగే 53వ సీనియర్‌ మహిళల, పురుషుల టోర్నీ ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామన్నారు. ఇందులో సంఘం కార్యదర్శి రాజేందర్‌, సభ్యులు మధు, సాయిబాబా, శ్రీకాంత్‌, వినోద్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన జట్ల వివరాలు:

మహిళా జట్టు: కీర్తీ, శృతి, సంధ్య, సృజన, శిరీష, మౌనిక, దీపిక, శ్రీదేవి, గంగనర్సు, నందిని, మనీష, తాయి, పావని, బీ శీరిష, నిఖిత, సరస్వతి

పురుషుల జట్టు: నందులాల్‌, సుధాకర్‌, బల్‌రామ్‌, అరవింద్‌, మధు, సురేశ్‌, చంద్రశేఖర్‌, ఈశ్వర్‌, దినేశ్‌, రాము, సాయికుమార్‌, వినీత్‌, వంశీ, నవీన్‌, నితిన్‌

ఫుట్‌బాల్‌ ఎంపికలకు హాజరుకావాలి

నిజామాబాద్‌ క్రీడావిభాగం : అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌(పురుషుల) పోటీల్లో ప్రాతినిధ్యం వహించడానికి ఈ నెల 6న జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నామని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి ఖలీల్‌హైమద్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. 01 జనవరి 2003 ముందు పుట్టినవారు అర్హులని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఉదయం 11.30 గంటలకు, జనన ధ్రువీకరణ, ఆధార్‌కార్డు నిజ పత్రాలు, నాలుగు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 14 నుంచి 17 వరకు నల్గొండలో జరిగే అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌(పురుషుల) పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

నేడు రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్‌ పోటీల ఎంపికలు

గుండారం(నిజామాబాద్‌ గ్రామీణం) : ఫెడరేషన్‌ కప్‌ రాష్ట్ర స్థాయి ఫ్లోర్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలను గుండారం జడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం చేపడుతున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు అహల్య, పీఈటీ కవిత తెలిపారు. పాఠశాల మైదానంలో ఉదయం పది గంటలకు బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉషూలో పతకాల పంట

నిజామాబాద్‌ క్రీడావిభాగం : ఉషూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభతో పతకాల పంట పండించారు. హైదరాబాద్‌లో సోమవారం 3వ సబ్‌ జూనియర్‌ రాష్ట్ర ఉషూ పోటీలు, ఎంపికలను నిర్వహించారు. ఇందులో జిల్లా క్రీడాకారులు 20 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 2 కాంస్య పతకాలను సాధించి సత్తాచాటారు. ఈనెల 25 నుంచి 30 వరకు కోల్‌కతాలో నిర్వహించే 19వ సబ్‌ జూనియర్‌ జాతీయస్థాయి పోటీలకు 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా ఉషూ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి ఉమేర్‌ తెలిపారు.

జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులు

అనాబియా తహరీన్‌, లోకేశ్‌యాదవ్‌, ఆకాంక్షయాదవ్‌, శశికిషన్‌రావు, ఫరియాఖానం, ఎండీ అఫ్రత్‌, ఎండీ అనాస్‌, తౌబ అథియ, కాంక్షరాథోడ్‌, ఎండీ అఫ్రత్‌, కారుణ్యకీర్తన్‌, శ్రీరాం, ప్రణవ్‌కుమార్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here