రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్‌ పోటీలు ప్రారంభం

0
1


రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్‌ పోటీలు ప్రారంభం


క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

మోపాల్‌, (నిజామాబాద్‌)న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగరంలోని బోర్గాం(పి)లో రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఫ్లోర్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను అసోసియేషన్‌ అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడంతో మానసికంగా బలపడతారన్నారు. చదువులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు. సంప్రదాయ క్రీడలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అనేక రకాల క్రీడలు ఉన్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొచ్చి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో నిజామాబాద్‌తోపాటు మెదక్‌, కామారెడ్డి, కరీంనగర్‌, అదిలాబాద్‌, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి వచ్చిన 18 బాలబాలికల జట్లు తలపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, చిట్టిసాయిరెడ్డి, మురళి, అభినవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తలపడుతున్న క్రీడాకారులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here