రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, త్రోబాల్‌ పోటీలకు ఎంపిక

0
2


రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, త్రోబాల్‌ పోటీలకు ఎంపిక

బాలుర జట్టు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అండర్‌- 14(బాలుర), అండర్‌- 17(బాలబాలికల) బాక్సింగ్‌ పోటీలకు ఎంపికలు పూర్తి చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ తెలిపారు. నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో బుధవారం జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి అండర్‌- 14లో ముగ్గురు, అండర్‌- 17లో నలుగురు బాలురు, ముగ్గురు బాలికలను ఎంపిక చేశామన్నారు. వీరు మహబూబాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఎంపైర్లుగా షంషముద్దిన్‌, యాకూబ్‌, పీడీ శ్రీధర్‌, పీఈటీ వెంకటేశ్వర్‌రావు, కామారెడ్డి ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి తారాచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

త్రోబాల్‌ క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి అండర్‌- 14, 17 బాలబాలికల త్రోబాల్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ తెలిపారు. అండర్‌-14 జట్లు మంచిర్యాలలో, అండర్‌- 17 జట్లు వికారాబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎంపికల్లో శ్రీనివాస్‌, సంతోష్‌ఠాకూర్‌, కృష్ణంరాజు, అబ్బయ్య, యాకూబ్‌, శ్రీధర్‌, అనురాధ, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

త్రోబాల్‌ పోటీలకు ఎంపికైన బాలికల జట్టుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here