రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్ల ప్రతిభ

0
0


రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్ల ప్రతిభ

ప్రథమస్థానంలో బాలుర జట్టు

ద్వితీయస్థానంలో బాలికల జట్టు

ప్రథమస్థానంలో నిలిచిన బాలుర జట్టు

నిజామాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు సత్తాచాటాయి. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఎస్జీఎఫ్‌ అండర్‌-17 రాష్ట్రస్థాయి టోర్నీ ఫైనల్స్‌ను నిర్వహించారు. బాలుర విభాగంలో వరంగల్‌ జట్టుపై 7-3 తేడాతో జిల్లా జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో మెదక్‌ జిల్లా జట్టుతో తలపడి జిల్లా జట్టు ఓటమి పాలై ద్వితీయస్థానంలో నిలిచింది. శిక్షకులు, మేనేజర్లుగా అనికేత్‌, సుష్మా, నవీన్‌, సంతోష్‌ వ్యవహరించారు.

జాతీయ పోటీలకు చంద్రహాస్‌

నిజామాబాద్‌ఖిల్లా: జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఇందూరు విద్యార్థి రెడ్డిశెట్టి చంద్రహాస్‌ ఎంపికయ్యాడు. చంద్రహాస్‌ ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఈనెల 2 నుంచి 4 వరకు ఖమ్మంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ బాస్కెట్‌బాల్‌ అండర్‌-17 టోర్నీలో ఇందూరు బాలుర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దిల్లీలో ఈనెల 17 నుంచి జరిగే జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని పీఈటీ పేర్కొన్నారు. చంద్రహాస్‌ను ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల జోనల్‌ ఇన్‌ఛార్జి భగవాన్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్‌ మేరీ అభినందించారు.

టార్గెట్‌బాల్‌ ఎంపికలకు హాజరుకావాలి

నిజామాబాద్‌ క్రీడావిభాగం: టార్గెట్‌బాల్‌ అండర్‌-17 బాలబాలికల విభాగంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీలకు, ఎంపికలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మోహన్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న క్రీడాకారులు జడ్పీహెచ్‌ఎస్‌(నల్లవెల్లి)లో ఉదయం 10 గంటలకు బోనఫైడ్‌లతో హాజరుకావాలని సూచించారు.

జిల్లాస్థాయి పోటీలకు జోనల్‌ జట్లు అర్హులు

నిజామాబాద్‌ క్రీడావిభాగం: ఫుట్‌బాల్‌ అండర్‌-14 బాలికల విభాగంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీలకు జోన్‌ జట్లు అర్హులని ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి మోహన్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని నాగారంలోని రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు బోనఫైడ్‌తో హాజరుకావాలని తెలిపారు.

ఉషూ క్రీడలో విద్యార్థిని ప్రతిభ

నిజామాబాద్‌ క్రీడావిభాగం: అక్షర్‌ధామ్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని కాంక్షరాథోడ్‌ ఉషూ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. నగరంలో మంగళవారం క్రీడాకారిణిని పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌రావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉషూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 3న నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు.

నేటి ఎంపికలకు హాజరుకావాలి

నిజామాబాద్‌ క్రీడావిభాగం: నెట్‌బాల్‌ అండర్‌-19 బాలబాలికల విభాగంలో ఈనెల 6న నిర్వహించే ఎంపికలకు ఉమ్మడిజిల్లాల క్రీడాకారులు హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌(అండర్‌-19) కార్యదర్శి గంగాధర్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(సుద్దులం)లో నిర్వహించే ఎంపికలకు క్రీడాకారులు మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 8నుంచి 10 వరకు వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here