రాష్ట్ర ప్రభుత్వం గల్ప్‌ కార్మికుల పట్ల శ్రద్ద వహించాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలని, ఎన్‌ఆర్‌ఐ పాలసీ వెంటనే అమలు చేయాలని, ఉన్నత చదువులు చదివి, ఉపాది కరువై గల్ఫ్‌ దేశాలు పోతే ఏజెంట్‌ మోసాలవల్ల, కంపనీలు జీతాలు ఇవ్వక, అప్పులు కట్టలేక, ఆత్మహత్య చేసుకుంటున్నారని గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక సదాశివనగర్‌కు చెందిన పోలబోయిన శ్రీనివాస్‌, సృజన్‌ నంది (సౌదీ అరేబియా ఆల్‌ గాస్సిమ్‌ అండ్‌ హయిల్‌) కోఅర్డినేటర్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు గాయ పడిన, మరణించిన, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్నారై పాలసీ ఉపయోగపడుతుందని అన్నారు. నిరసన కార్యక్రమంలో దేవోల్ల పోశెట్టి, పడిగెల ప్రవీణ్‌, లోకాని గంగారామ్‌, రాధ అనిల్‌, శ్రీకాంత్‌, రెబల్‌ భరత్‌, మాదసు తిరుపతి ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here