రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడి అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర రెండవ మహాసభలు నవంబర్‌ 3, 4 తేదీలలో నిజామాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్‌ మాట్లాడారు. నవంబర్‌ 3, 4 తేదీలలో నిజామాబాద్‌ నగరంలో రాష్ట్ర మహా సభలు జరుగుతాయని, మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది డెలిగేట్స్‌ హాజరవుతారని అన్నారు. ప్రధానంగా బీడీ ఇండస్ట్రీ మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను రద్దు చేయాలని కార్మికులందరికీ చేతినిండా పని కల్పించాలని అన్నారు. జీవనభతి కార్మికులందరికీ ఇవ్వాలని కార్మికులందరికీ కనీస వేతనం అమలు కోసం మహాసభలలో చర్చించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించు కోడానికి మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. కార్మికులందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు. 3వ తేదీన భారీ బహిరంగ సభకు బీడీ కార్మికులందరూ హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుతాడి ఎల్లయ్య, రాజు, మధు, ప్యాకర్లు లక్ష్మీనారాయణ, గంగాధర్‌, గంగాధర్‌, రఫిక్‌, సవిత తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here