రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపిక

0
2


రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపిక

క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తున్న శిక్షకుడు

కామారెడ్డి క్రీడా విభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా హాకీ క్రీడాకారులను శనివారం ఎంపిక చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన అండర్‌-17 బాలురకు హాకీ క్రీడా పోటీలు నిర్వహించారు. మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి తారాచంద్‌ తెలిపారు. ఎంపికైన ఆటగాళ్లకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆదిలాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు నీల లింగం, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు హీరాలాల్‌, మధుసూదన్‌రెడ్డి, స్వామిగౌడ్‌, మోహన్‌రెడ్డి, సురేశ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు వీరే: కామారెడ్డి జిల్లా నుంచి సురేశ్‌, సంతోష్‌, సేవ్యా, సంతోష్‌, రిశాంక్‌గౌడ్‌, అజయ్‌, నిజామాబాద్‌ నుంచి గిరి, చరణ్‌, వినోద్‌, సృజన్‌, నితిన్‌, చైతన్య, సుదీప్‌, సాయికిరణ్‌, నితిన్‌, ఓంకార్‌, రాజేశ్వర్‌, నితిన్‌, వేదవ్యాస్‌లు ఎంపికయ్యారు.


ప్రపంచ యూత్‌ చదరంగం పోటీల్లో ప్రతిభ

శ్రీశ్వాన్‌

కామారెడ్డి పట్టణం: ప్రపంచ యూత్‌ చదరంగం పోటీ ల్లో నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌కు చెందిన శ్రీశ్వాన్‌ మూడో ర్యాంకు సాధించి ప్రతిభ చాటినట్లు కర్షక్‌ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌ రషీద్‌ పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 12 వ తేదీ వరకు ముంబయిలో జరిగిన పోటీల్లో సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా ప క్షాల ప్రతినిధులు విద్యార్థి ప్రతిభను అభినందించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here