రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!

0
0


రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!

భోపాల్‌ : పెద్దలు పెట్టిన పేరు ఆ యువకుడికి కష్టాలు తెచ్చి పెట్టింది. అభిమానంతో తమ పిల్లోడికి పేరు పెట్టారే గానీ.. పెద్దయ్యాక అతడికి కష్టాలు వస్తాయని వారికేం తెలుసు. అలా ఇష్టంగా పెట్టుకున్న పేరు చివరకు కష్టంగా మారిన వైనం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అభిమాన నటీనటుల పేర్లు.. రాజకీయ నేతల పేర్లు తమ పిల్లలకు కామనే కదా. అదే కోవలో ఆ పెద్దలు కూడా తమ పిల్లోడికి ఓ పెద్ద లీడర్ పేరు పెట్టారు. పాపం ఆయన పెద్దయ్యాక.. ఆ పెద్దలు చేసిన పాపానికి కష్టాలు అనుభవించాడు.

కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇండోర్‌లోని అఖండ్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం అప్పుడెప్పుడో ఆ ఇంట్లో జన్మించిన పిల్లోడికి రాహుల్ గాంధీ అని పేరు పెట్టారు. ఆ పిల్లోడు కాస్తా పెరిగి పెద్దయ్యాడు. అయితే ఆ పేరుతో తంటాలు పడుతున్నాడు. ఆ పేరే అతని పాలిట శాపమైంది. బ్యాంకు రుణాలు కాదు కదా.. కనీసం మొబైల్ ఫోన్ కోసం సిమ్ కావాలంటే కూడా ఇవ్వలేదట.

అభిమానమో ఏమో గానీ మా పెద్దలు పెట్టిన ఈ పేరు ఇప్పుడు తనకు తలనొప్పిగా మారిందంటున్నాడు సదరు యువకుడు. రాహుల్ గాంధీ పేరుతో తను చాలాసార్లు అవమానాల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుని చివరకు పేరు మార్చుకునేంత వరకు వచ్చింది వ్యవహారం. రాహుల్ గాంధీ బదులు రాహుల్ మాలవియా అని పేరు మార్చుకున్నాడట. అంతేకాదు సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నింటిలోనూ కొత్త పేరు మార్పు చేయించుకున్నాడట. అలా రాహుల్ గాంధీ పేరు ఆ యువకుడికి అన్నీ తంటాలు తెచ్చిందన్నమాట.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here