రికార్డ్‌స్థాయిలో H1B వీసాల తిరస్కరణ, భారత ఐటీ కంపెనీలపై భారం

0
0


రికార్డ్‌స్థాయిలో H1B వీసాల తిరస్కరణ, భారత ఐటీ కంపెనీలపై భారం

న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీల H1B వీసా దరఖాస్తుల తిరస్కరణ గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో తిరస్కరణకు గురైంది. ఈ మేరకు అమెరికాకు చెందిన రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. సాఫ్టువేర్ కంపెనీ ఉద్యోగుల వర్క్ వీసాలు అత్యధిక స్థాయిలో తిరస్కరించబడ్డాయి. దేశంలోని నాలుగు మేజర్ టెక్ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో సంస్థలకు చెందిన దాదాపు సగంవర్క్ వీసా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి.

నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన తిరస్కరణలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ టాప్ కంపెనీల వర్క్ వీసాలు పెద్ద మొత్తంలో తిరస్కరించబడ్డాయి. టీసీఎస్ కంపెనీకి చెందిన వీసాలు 2015లో 6 శాతం ఉంటే 2018 అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో (2019 ఆర్థిక సంవత్సరం) 37 శాతానికి పెరిగాయి.

టాప్ ఐటీ కంపెనీల వీసాల తిరస్కరణ ఇలా

టాప్ ఐటీ కంపెనీల వీసాల తిరస్కరణ ఇలా

ఇన్ఫోసిస్ వీసాలు 2015 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం తిరస్కరిస్తే, 2018 అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్‌లో 57 శాతానికి పెరిగాయి. హెచ్‌సీఎల్ వీసాలు 2015లో 2 శాతం తిరస్కరిస్తే 2018 అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్‌లో 43 శాతానికి పెరిగాయి. విప్రో వీసాలు 2015లో 7 శాతం తిరస్కరిస్తే 2018 అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్‌లో 62శాతానికి పెరిగాయి.

అప్రూవల్స్, తిరస్కరణ... పర్సెంటేజీలో...

అప్రూవల్స్, తిరస్కరణ… పర్సెంటేజీలో…

మొత్తంగా 2015 ఆర్థిక సంవత్సరంలో వీసాల తిరస్కరణ 4.3 శాతం ఉంటే, అప్రూవ్ అయినవి 83.2 శాతంగా ఉన్నాయి. అదే 2019 క్వార్టర్ 3లో మాత్రం తిరస్కరణలు ఏకంగా 16.1 శాతానికి పెరిగాయి. అదే సమయంలో అప్రూవల్స్ 62.7 శాతానికి పరిమితమయ్యాయి.

రికార్డ్ హైకి చేరుకున్నాయి...

రికార్డ్ హైకి చేరుకున్నాయి…

వీసాలు తిరస్కరించిన దరఖాస్తుల సంఖ్య రికార్డ్ హైకి చేరుకున్నాయని నాస్కామ్ ఇండస్ట్రీ బాడీ గ్లోబల్ ట్రేడ్ డిపార్టుమెంట్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. ఈ పరిణామం కీలకమైన అమెరికా మార్కెట్లలో క్లయింట్స్‌కు సేవలు అందించే విషయంలో భారత ఐటీ కంపెనీల సామర్థ్యంపై ప్రభావాన్ని చూపుతోందన్నారు. వ్యయాల భారాన్ని కూడా పెంచుతోందన్నారు. ఐటీ కంపెనీలు ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here