రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనపై ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన

0
0


రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనపై ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన

మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదేనేమో. ఇప్పటికే వాహనాల అమ్మకాలు తగ్గిపోతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు మరో గండాన్ని ఎదుర్కోబోతోంది. కొత్త వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలే ఇందుకు ప్రధాన కారణం. పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజులను కూడా బాగానే పెంచాలని ప్రతిపాదించారు. వీటి మూలంగా ఆటోమొబైల్ పరిశ్రమ పై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా పాతవాహనాల వినియోగం లేకుండా చేయడానికి, ఎలక్రిక్ వాహనాల వినియోగం దిశగా అడుగులు వేయడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కొనుగోలుదారులపై భారం

*ఈ రోజుల్లో బైకులు, కార్లు తప్పనిసరిగా మారాయి. వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎక్కువవుతోంది. అందుకే పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాహనాల వినియోగం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

* వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వల్ల వీటి కొనుగోళ్ల విషయంలో ప్రజలు పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

* తాజాగా పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రతిపాదించిన ఫీజులను అమలు చేస్తే వాహన కొనుగోలుదారులపై భారీగా భారం పడే అవకాశం ఉంటుంది

* ప్రస్తుతం టూవీలర్ రిజిస్ట్రేషన్ చార్జీ రూ.50 ఉండగా దీన్ని రూ.1,000 పెంచాలని ప్రతిపాదించారు.

* త్రీవీలర్ రిజిస్ట్రేషన్ చార్జీని రూ.300 నుంచి రూ.5,000కు, ఎల్ ఎం వీ పర్సనల్ కారు లేదా జీప్ ఫీజులు రూ.600 నుంచి రూ.5,000కు, ఎల్ ఎం వీ కమర్షియల్ వాహన చార్జీని రూ.1,000 నుంచి రూ.10,000కు, మీడియం అండ్ హెవీ గూడ్స్/ ప్యాసెంజర్ పై రూ.1,500 నుంచి రూ.20,000కు పెంచాలని ప్రతిపాదించారు.

* దిగుమతి చేసుకున్న వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 2,500 నుంచి రూ. 20,000కు పెంచనున్నారు.

* టూ వీలర్ రెన్యూవల్ పై రిజిస్ట్రేషన్ చార్జీని రూ. 50 నుంచి రూ. 2,000కు, త్రీవీలర్ అయితే రూ.300 నుంచి రూ.10,000కు, ఎల్ ఎం వీ పర్సనల్ కారు లేదా జీప్ అయితే రూ. 600 నుంచి రూ. 15,000కు, ఎల్ ఎం వీ కమర్షియల్ అయితే రూ. 1,000 నుంచి రూ.20,000 వరకు, మీడియం అండ్ హెవీ గూడ్స్/ ప్యాసెంజర్ వాహనాలపై రూ. 1,500 నుంచి రూ. 40,000 కు పెంచాలని ప్రతిపాదించారు.

ప్రతికూల ప్రభావాలు ...

ప్రతికూల ప్రభావాలు …

* వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచితే అటు వాహన కొనుగోలుదారులపై ఇటు వాహనాల కంపెనీలపై ప్రభావం పడటానికి అవకాశాలు ఉంటాయి.

* ఇప్పటికే వాహనాల కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. వాహన బీమా పెరిగింది. వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఇంధనాల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గిపోతున్నాయి.

* వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా భారత్ స్టేజ్-6 నిభందనలు అమలు కానున్నాయి. వీటి మూలంగా వాహనాల ధరలు మరింత పెరగనున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు తయారు చేయడానికి కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

* మరోవైపు ఎలక్ట్రిక్ వాహన తయారీకి మారిపోయే విధంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందుకు అనుగుణంగా కూడా కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.

* ఓ వైపు అమ్మకాలు తగ్గిపోతుండటం, మరోవైపు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెస్తుండటం పట్ల ఆటోమొబైల్ కంపెనీలకు ఊపిరి ఆడకుండా అవుతోంది.

ఆటో డీలర్లకు అప్పులు కష్టమే...

ఆటో డీలర్లకు అప్పులు కష్టమే…

* వాహనాల అమ్మకాలు తగ్గిపోతుండటం వల్ల డీలర్ల వద్ద నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా డీలర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* ఇప్పటికే కొంతమంది డీలర్ షిప్ లను మూసివేసుకోవాల్సి వచ్చినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* ఇక ఆటోమొబైల్ డీలర్లకు ఇచ్చిన రుణాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు పలు బ్యాంకులు చెబుతున్నాయి. భవిష్యత్ రుణాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నాయట.

* ఆటోమొబైల్ డీలర్లు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు రూ. 70,000-80,000 కోట్ల వరకు ఉంటాయని బ్యాంకింగ్ పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here