రిద్ధి నాట్యసిద్ధి

0
2


రిద్ధి నాట్యసిద్ధి

గాజుముక్కలు..
కుండలపై దీపాలతో నర్తన
రాణిస్తున్న ఇందూరు చిన్నారి
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

జతులకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. అభినయంతో నవరసాలను పలికిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఇందూరు చిన్నారి రిద్ధి. కత్తులు.. పగిలిన గాజుముక్కలు, తలపై కుండలు పెట్టుకొని.. రింగ్‌ తిప్పుతూ.. నాట్యం చేస్తూ ఔరా అనిపిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పలు వేదికలపై నర్తించిన చిన్నారి.. జులై 21న మలేషియా తెలుగు సంఘం వారు నిర్వహించిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ప్రతిభ చాటింది.

పేరు: రిద్ధి, అమ్మ రమాదేవి, నాన్న రతన్‌ప్రసాద్‌(ప్రభుత్వ ఉద్యోగులు), నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో నివాసం.
చదువు: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి.
ఎప్పటి నుంచి: రెండేళ్ల వయస్సు నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకొంది.
ఎక్కడ శిక్షణ: శాస్త్రీయ నృత్యంపై సిద్ధార్థ కళాక్షేత్రం నాట్య గురువు జయలక్ష్మి వద్ద శిక్షణ. ప్రస్తుతం ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో పేరిణి నృత్యం సర్టిఫికెట్‌ కోర్సు ద్వితీయ సంవత్సరం చేస్తోంది.
ప్రత్యేకం: కత్తులు, పగిలిన గాజుముక్కలపై రెండు చేతులతో పాటు తల మీద కుండలపై దీపాలను వెలిగించుకొని రింగ్‌డ్యాన్స్‌ చేయడంలో దిట్ట.

ప్రదర్శనలు:
2017, 2018.. జిల్లా స్థాయిలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, కొత్త అంబేడ్కర్‌భవన్‌, కలెక్టరేట్‌తో పాటు ముంబయి, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, జగిత్యాల వంటి ప్రాంతాల్లో వేదికలపై ప్రదర్శనలు.
* 2018.. హైదరాబాద్‌ త్యాగరాయ గానసభ, తెలుగు కళాలలిత తోరణం వంటి వేదికలపై..
* 2018.. విశ్వకళా యజ్ఞం వేదికపై అరుదైన ప్రదర్శన
* 2019.. మహారాష్ట్ర షిరిడీ సాయినాథుని సన్నిధిలో నృత్యం. దేశరాజధాని కొత్త దిల్లీలో ప్రదర్శన
* 2019 జూన్‌ 21.. మలేషియాలో కల్చరల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో నర్తించి ఆహుతులచే సన్మానం.
ప్రత్యేక ప్రదర్శన: బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక నర్తనం. వారణాసిలో గంగాహారతి సందర్భంగా నాట్యం. ఇప్పటి వరకు సుమారు 200 కు పైగా ప్రదర్శనలు.
సినీ.. బుల్లితెర కోసం: హైదరాబాద్‌లో పలు ప్రైవేటు ఛానళ్ల వారు నిర్వహించే సినీ, టీవీ నటుల పురస్కారాల వేడుకల్లో తన అభినయంతో ఆహుతులను అలరిస్తోంది. దూరదర్శన్‌, శివశక్తి సాయి, మెట్రో, సంస్కృతి వంటి ఛానళ్లలో వచ్చే కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చింది.
అభినందనలు.. పతకాలు
* 2017 నుంచి 2019 వరకు జిల్లా స్థాయిలో ఉత్తమ బాలనర్తకిగా పురస్కారం
* 2016.. సిలికానాంధ్ర వారిచే నాట్యసమ్మేళనంలో పాల్గొని గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సొంతం
* గుంటూరు కళానిలయం వారిచే నాట్యమయూరి, బంగారు బతుకమ్మ పురస్కారం
* 2017, 2018.. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డు
* 2017.. మాజీ గవర్నర్‌ రోశయ్య చేతుల మీదుగా సూపర్‌కిడ్స్‌ పురస్కారం
* 2018.. అప్పటి కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం, కల్వకుంట్ల కవిత, అప్పటి మంత్రి పోచారం, కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావుచే సన్మానం
* 2019.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణచే అభినందనలు
* సినీదర్శకులు, నటులు కళాతపస్వి కె.విశ్వనాథ్‌, వి.వి.వినాయక్‌, మురళీమోహన్‌, కోట శ్రీనివాస్‌రావు, సుమన్‌, సినీహాస్య నటుడు అలీ, అనసూయ తదితరుల నుంచి ప్రత్యేక అభినందనలు

నాట్యమంటే ప్రాణం : రిద్ధి
నాకు చిన్నప్పటి నుంచి నాట్యమంటే ప్రాణం. అమ్మానాన్న దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. నాట్య శిక్షణ ఇస్తున్న గురువులను మరిచిపోలేను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here