రిలయన్స్, ఎస్బీఐకు షాక్, టీసీఎస్ ఫస్ట్: టాప్-10 కంపెనీల్లో 8 కంపెనీల నష్టం రూ.89,535 కోట్లు

0
1


రిలయన్స్, ఎస్బీఐకు షాక్, టీసీఎస్ ఫస్ట్: టాప్-10 కంపెనీల్లో 8 కంపెనీల నష్టం రూ.89,535 కోట్లు

ముంబై: గత వారం షేర్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఓ దశలో పదిహేడేళ్ల కనిష్టానికి మార్కెట్లు దిగజారాయి. వారం మొదట్లో కాస్త లాభాల్లో కనిపించినా, గురువారం భారీగా నష్టపోయాయి. శుక్రవారం కాస్త కోలుకున్నాయి. గురువారం ఒక్క రోజు లక్ష కోట్లకు పైగా ఇన్వెస్టర్లు కోల్పోయారు. గత వారం టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో 8 కంపెనీలు రూ.89,535 కోట్ల మార్కెట్ వ్యాల్యూను కోల్పోయాయి. ఇందులో ప్రభుత్వరంగ ఎస్బీఐ ఎక్కువగా నష్టపోయింది.

టాప్ 10 కంపెనీల్లో లాభపడ్డవి రెండే

మొదటి టాప్ 10 కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) మాత్రమే పెరిగింది. టాప్ టెన్ జాబితాలోని మిగతా ఎనిమిది కంపెనీల మార్కెట్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. టాప్ టెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీలు.. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, HUL, HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, SBI, ICICI బ్యాంకు.

రిలయన్స్, HDFC ఎం-క్యాప్

రిలయన్స్, HDFC ఎం-క్యాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (LTD), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, SBI, ICICI బ్యాంకులు గత వారం నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.18,952.5 కోట్లు నష్టపోయి రూ.7,50,674.86గా ఉంది. HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.16,774.8 తగ్గి రూ.6,05,627.15గా ఉంది.

ఇన్ఫోసిస్, మరిన్ని కంపెనీల ఎం-క్యాప్

ఇన్ఫోసిస్, మరిన్ని కంపెనీల ఎం-క్యాప్

HDFC మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.7,660.34 పడిపోయి రూ.3,66,471.19కు చేరుకుంది. ITC మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.6,995.81 తగ్గి రూ.3,24,753.23 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ..5,111.1 తగ్గి రూ.3,33,037.59 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.3,003.03 తగ్గి రూ.2,65,122.36 కోట్లకు చేరుకుంది.

టాప్ టెన్ ఎం-క్యాప్..

టాప్ టెన్ ఎం-క్యాప్..

టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో టీసీఎస్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత RIL, HDFC బ్యాంకు, HUL, HDFC, ఇన్ఫోసిస్, ITC, కొటక్ మహీంద్రా బ్యాంకు, SBI, ICICI బ్యాంకు ఉన్నాయి. కాగా, గత వారం సెన్సెక్స్ 764.57 పాయింట్లు (2.01 శాతం) నష్టపోయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here