రిలయన్స్ గిగాఫైబర్ లాంచ్ తేదీ, ఫ్రీ సేవలు, IOT: నెలకు రూ.700 నుంచి రూ.10,000

0
1


రిలయన్స్ గిగాఫైబర్ లాంచ్ తేదీ, ఫ్రీ సేవలు, IOT: నెలకు రూ.700 నుంచి రూ.10,000

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) జియో గిగా ఫైబర్ వంటి కీలక ప్రకటనలు చేశారు. 42వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)సందర్భంగా ఆయన ప్రసంగించారు. రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్ లాంచ్

సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జియో లాంచ్ అయి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో గిగా ఫైబర్‌ను కూడా అదే రోజు ప్రారంభించనున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. గిగా ఫైబర్ కమర్షియల్ బేసిస్ సేవలు 1600 నగరాల్లోని 20 మిలియన్ల నివాసాలకు అందిస్తామని వెల్లడించారు. 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

జియో ఫైబర్ ఫీచర్స్ వివరించిన ఇషా, ఆకాష్

జియో ఫైబర్ ఫీచర్స్ వివరించిన ఇషా, ఆకాష్

జియో ఫైబర్ ఫీచర్ల గురించి ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ వివరించారు. జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికి అయినా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్ సేవలు ఉచితం అని చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)

2020 జనవరి ఒకటో తేదీ నుంచి జియో కమర్షియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జియో గిగా ఫైబర్ ద్వారా సోషల్ గేమింగ్ పేరుతో మల్టిపుల్‌ గేమింగ్ సేవల్ని అందిస్తామని తెలిపారు. మిక్స్‌డ్ రియాల్టీ పేరుతో సరికొత్త వర్చువల్ రియాల్టీ సేవలు అందిస్తామని తెలిపారు.

గిగా ఫైబర్ బేసిక్ స్పీడ్, ధరలు రూ.700 నుంచి రూ.10,000 వరకు

గిగా ఫైబర్ బేసిక్ స్పీడ్, ధరలు రూ.700 నుంచి రూ.10,000 వరకు

రిలయన్స్ జియో గిగా ఫైబర్ బేసిక్ స్పీడ్ 100 MBPS. 1Gbps వరకు డేటా. జియో గిగా ఫైబర్ టారిఫ్ రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఆయా సేవలను బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయి.

జీవితకాలం ఉచిత సేవలు

జీవితకాలం ఉచిత సేవలు

జియో ఫైబర్ ద్వారా దేశంలోని ఏ టెలికాం ఆపరేటర్‌కు అయినా ఇంటి నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి. జియో నుంచి నెలకు రూ.500తో అమెరికా, కెనడాలకు అపరిమిత కాలింగ్ ప్యాకేజీ.

వెల్ కమ్ ఆఫర్

వెల్ కమ్ ఆఫర్

వెల్‌కం ఆఫర్ (ప్రారంభ ఆఫర్) కింద ఫరెవర్ వార్షిక ప్లాన్ తీసుకునే జియో ఫైబర్ కస్టమర్లు హెచ్‌డీ/ 4కే ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా తీసుకోవచ్చును.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here