రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

0
2


రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

మాట్లాడుతున్న పాలనాధికారి సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రుణాల లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డీసీసీ/డీఎల్‌ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఖరీఫ్‌ రుణలక్ష్యం రూ. 1205కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.676కోట్లు మాత్రమే పంపిణీ జరిగిందని, మిగతా రుణాలను త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల రాయితీ రుణాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధరణి ఫోర్టల్‌ అందుబాటులోకి వచ్చినందు వల్ల రుణాల మంజూరు వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అక్టోబరు 5వ తేదీన అన్ని ప్రభుత్వ రంగబ్యాంకుల ఖాతాదారుల సమ్మేళనం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు అధికారి రాజేందర్‌రెడ్డి, ఆర్‌బీఐ అధికారి మూర్తి, రేణుక, వాసుదేవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయాలి

కామారెడ్డి కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ కోరారు. ఈ నెల 28వ తేదీన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థినులచే, 29న జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ మహిళలతో, 30న కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో ఐకేపీ, డీఆర్‌డీఏ శాఖలతో, అక్టోబరు 1న ఆర్కే డిగ్రీ కళాశాల, 2న సాందీపని డిగ్రీ కళాశాలలో, 3న వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో, 4న మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా మహిళలతో, 6న కామారెడ్డి వీక్లీ మార్కెట్‌లో బతుకమ్మ సంబురాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here