రుణాల సద్వినియోగంపై అవగాహన కల్పించాలి

0
4రుణాల సద్వినియోగంపై అవగాహన కల్పించాలి
ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: రైతులు, ప్రజలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొన్నప్పుడు రుణ లక్ష్యాలు, వాటిని సద్వినియోగం చేసుకొనే విధానంపై అవగాహన కల్పించాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వాలు పేదల కోసం మంజూరు చేసే రాయితీ మొత్తాలు రుణ బకాయిల కింద తీసుకోవడం సరికాదన్నారు. రైతులు, పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి పథకాల ద్వారా రాయితీ అందిస్తున్నారని తెలిపారు. ఈ మొత్తాలను రుణ బకాయిల కింద తీసుకొంటున్నారని పలు సందర్భాల్లో తమకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. గత మార్చి వరకు బ్యాంకు ద్వారా అందజేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు లక్ష్యాలను మించిపోయాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయమై ఆలోచించాలన్నారు. జీవనోపాధి రుణాల కోసం చేసుకొన్న దరఖాస్తులు చాలావరకు అపరిష్కృతంగా ఉన్నాయని, ఈ రుణాల మంజూరు విషయమై పరిశీలించాలన్నారు. అర్హులైన రైతులు బీమా ఉపయోగించుకొనేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రుణ ప్రణాళిక ప్రకారం 2019-20 సంవత్సరానికి ప్రాధాన్య రంగాల కింద 2,74,341 మందికి రూ.5454.18 కోట్లు, ఇతర రంగాల వారికి రూ.150 కోట్లు మంజూరు చేయాడానికి ఆమోదం తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సురేష్‌రెడ్డి, ఆర్‌బీఐ ఏజీఎం వెంకటేషం, ఎస్‌బీఐ ఏజీఎం నాయక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

22న నీటి సంరక్షణపై గ్రామ సభ
నీటి సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ నెల 22న ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీసీలోఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులపై సర్పంచులు, ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రధానమంత్రి సర్పంచుల పేరు మీద లేఖలు పంపించారని తెలిపారు. అవి ఈ నెల 20వ తేదీలోగా వారికి అందేలా చూడాలని, 22న ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని తెలిపారు. గ్రామసభలో ప్రధానమంత్రి లేఖను ప్రజలకు చదివి వినిపించాలని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని విధానాలపై చర్చించాలని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం చేసుకొనే విధంగా చూడాలని తెలిపారు. వీసీలో డీఆర్‌డీవో రమేష్‌, డీపీవో జయసుధ, ప్రసాద్‌, వినయ్‌కుమార్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here