రుపే కార్డులు వాడుతున్నారా… అయితే మీకోసమే ఈ ఆఫర్లు

0
2


రుపే కార్డులు వాడుతున్నారా… అయితే మీకోసమే ఈ ఆఫర్లు

ఈ భాగస్వామ్యం ద్వారా దాదాపు 60 కోట్ల మంది రుపే కార్డు వినియోగదారులు తమ వెబ్ సైట్ లో కొనుగోళ్ల ద్వారా తక్షణమే 20 శాతం డిస్కౌంట్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. ఇది డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రయోజనం కలిగించే ఆఫర్ అని సంస్థ పేర్కొంది.

* రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చ్ 31 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు 58.6 కోట్ల రుపే కార్డులను జారీ చేశాయి.

* ఎస్ బీ ఐ కార్డు కూడా రుపే క్రెడిట్ కార్డులను తీసుకురావాలనుకుంటోంది.

* జన్ ధన్ ఖాతాల వినియోగదారుల నుంచి ఇతర ఖాతాల వినియోగ దారుల వరకు బ్యాంకులు రుపే కార్డులను జారీ చేస్తున్నాయి. వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది.

* గత ఏడాదిలో స్నాప్ డీల్ 13 అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ బ్యాంకులతో పాటు 3 డిజిటల్ వ్యాలెట్లతో జట్టు కట్టింది. ఈ సందర్భంగా దాదాపు రూ.100 కోట్ల విలువైన డిస్కౌంట్లను కొనుగోలుదారులకు అందజేసింది.

మిగతా కార్డులపైనా ఆఫర్లు..

* ఫ్లిప్ కార్ట్ సంస్థ ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు బిగ్ బిలియన్ డేస్ పేరుతో అమ్మకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐ సి ఐ సి ఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల లతో కొనుగోళ్లు జరిపితే 10 10 శాతం వరకు పొదుపు లేదా రూ.10,000 వరకు తక్షణ డిస్కౌంట్ ను పొందే అవకాశం కల్పిస్తోంది.

* అమెజాన్ కూడా ఎస్ బీ ఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల తో కొనుగోళ్లు చేస్తే 10 శాతం వరకు ఆదా లేదా రూ. 10,000 వరకు తక్షణ డిస్కౌంట్ + బోనస్ ఆఫర్ ను అందిస్తోంది.

దసరా, దీపావళి ప్రధానం

* మన దేశంలో దసరా, దీపావళి పెద్ద పండుగలుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో కొత్త ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు, మొబైల్స్, గాడ్జెట్స్ అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేపడుతున్నాయి.

* ఈ సారి ఈ కంపెనీలు పెద్ద పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఆఫర్లను ఇస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here