రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే…!!

0
2


రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే…!!

కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి మినహాయింపు ఇస్తారని భావించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారు వచ్చి అడిగినా చిన్న ఉద్యోగం చెప్పలేకపోతున్నామంటూ మంత్రులు వాపోయారు. తమకు కొంత వరకైనా అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. ముఖ్యమంత్రి మాత్రం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటూ తేల్చేసారు. ఇదే సమయంలో రేషన్ బియ్యం దుర్వినియోగం పైనా మంత్రులు సీఎంతో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ మంత్రులు సీఎంకు చెప్పుకోగా..ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు.

రాజకీయ జోక్యం కుదరదంటూ సీఎం జగన్…

ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. అధికారిక అజెండా ముగిసిన తరువాత..అధికారులు వెళ్లి పోయిన తరువాత మంత్రులు తాము ఎంతో కాలంగా సీఎం కు చెప్పాలనుకుంటున్న విషయాలను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ముందుగానే మంత్రులు కొందరు ఆ విషయాలను ప్రస్తావించాలని నిర్ణయించి..ఒకే సారి ప్రస్తావించారు. అందులో ప్రధానంగా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో సిఫార్సులు చేయమంటూ పార్టీ కోసం పని చేసిన వారు తమ వద్దకు వస్తున్నారని..తాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని చెబుతూ.. అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి మాత్రం చాలా స్పష్టంగా చెప్పేసారు. ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా పరీక్షలో మార్కుల ఆధారంగానే నియమకాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం కుదరదంటూ మంత్రులకు నిర్మొహమాటంగా తేల్చేసారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రాజకీయ జోక్యం తగదని..మంత్రులెవరూ జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. మంత్రులు ఇంకా ఇదే అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేయగా..ఇందులో ఎటువంటి సిఫార్సులకు అవకాశం లేదని చెప్పిన ముఖ్యమంత్రి..మరో విషయం మీద చర్చకు వెళ్దామని స్పష్టం చేయటంతో మంత్రులు కామ్ అయిపోయారు.

రేషన్ బియ్యం దుర్వినియోగంపై చర్చ.

రేషన్ బియ్యం దుర్వినియోగంపై చర్చ.

మంత్రులు కొందరు రేషన్ బియ్యం దుర్వినియోగం పైన ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. సంక్షేమ పథకాల కోసం చాలా మంది తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటున్నారంటూ అభిప్రాయపడ్డారు. తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నా చాలా మంది బియ్యం తీసుకోవడం లేదన్న పలువురు మంత్రులు సీఎంకు వివరించారు. తెల్ల రేషన్ కార్డులున్నా బియ్యం తీసుకోకపోవడంతో బియ్యం రీ-సైక్లింగుకి వెళ్తోందనే భావనను మంత్రులు వ్యక్తం చేసారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతమున్న తెల్ల రేషన్ కార్డులను కొనసాగిస్తూనే.. రేషన్ బియ్యం కోసం ప్రత్యేక కార్డులివ్వాలనే ప్రతిపాదనను కొందరు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు. అయితే, రేషన్ బియ్యం అవసరమైన వారికే రైస్ కార్డులిస్తే.. దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని మరి కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీంతో.. రైస్ కార్డులిచ్చే ప్రతిపాదనపై మరింత చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని మంత్రి కొడాలి నాని సూచించటంతో ఆ చర్చ ముగిసింది. ఇక, జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ విషయంలో పరీక్ష రాసే కాంట్రాక్టు సిబ్బందికిచ్చే మార్కుల విషయంలో వస్తోన్న ఇబ్బందులను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణీ ప్రస్తావించి వారికి న్యాయం చేయాలని కోరారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి ఇబ్బందులేమైనా ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు.

నామినేటెడ్ పోస్టుల పైనా మంత్రుల అభ్యర్ధన..

నామినేటెడ్ పోస్టుల పైనా మంత్రుల అభ్యర్ధన..

చర్చ కొనసాగింపులో బాగంగా కొందరు మంత్రులు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒత్తిడి వస్తోందని ముఖ్యమంత్రికి నివేదించారు. తమ నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన వారు ప్రతీ రోజు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారని..వారికి స్పష్టత ఇవ్వలేకపోతున్నామని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో.. రాష్ట్ర స్థాయిలోనే కాదు..నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసిన ఏ

ఒక్కరికి అన్యాయం జరగ్గకుండా నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి పినిపె విశ్వరూప్ ప్రస్తావించగా.. ఎటువంటి ఇబ్బంది లేదని.. ఆ సమస్యను పరిష్కరించేశామని సీఎం సలహాదారు శ్యామ్యూల్ స్పష్టం చేసారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here