రూ.10 లక్షలకే E-కారు, సిద్ధమవుతున్న హ్యుండాయ్

0
1


రూ.10 లక్షలకే E-కారు, సిద్ధమవుతున్న హ్యుండాయ్

న్యూఢిల్లీ: సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ ఇటీవల ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు (ఈ-కారు)ను తెచ్చేందుకు సిద్ధమైంది. రూ.10 లక్షలకే భారత్ మార్కెట్లో దీనిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ-కారు వెహికిల్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. చెన్నైలోని హ్యుండాయ్ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేయనున్నారు.

మినీ ఎస్‌యూవీలా..

తయారు చేయబోయే ఈ-కారు మినీ ఎస్‌యూవీలా ఉంటుందని భావిస్తున్నారు. ప్రీమియం హ్యాచ్ బ్యాక్‌తో భిన్నంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన కారును మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. మరోవైపు, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ బిల్స్ పెరగడం, కాలుష్యం వంటి కారణాలతో కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం కూడా కంపెనీలను ఈ-వెహికిల్స్ దిశగా ప్రోత్సహిస్తోంది.

ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్రొడక్షన్

ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్రొడక్షన్

అలాగే, హ్యుండాయ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది. సుజుకి, టయోటాలు గుజరాత్‍‌లో ఈ ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సరైన భాగస్వామి కోసం హ్యుండాయ్ చర్చలు జరుపుతోంది. కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు LG, శాంసంగ్ SDI, SK ఇన్నోవేషన్స్‌తో పాటు చైనా కంపెనీలతోను చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్ కోసం పూర్తిగా కొత్త మరియు విభిన్నమైన ఉత్పత్తిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీని బాడీ స్టైల్ విప్లవాత్మకంగా భారత్‌కు అంకితమయ్యేదిగా ఉంటుందని హ్యూండాయ్ ఇండియా ఎండీ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. అన్ని బాడీ స్టైల్స్‌పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here