రూ.15 లక్షల గుట్కా పట్టివేత

0
0


రూ.15 లక్షల గుట్కా పట్టివేత

ఇద్దరి అరెస్టు, మూడు వాహనాలు సీజ్‌

వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను నిజామాబాద్‌ ఒకటో ఠాణా పోలీసులు పట్టుకొన్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి, రూ.15 లక్షల విలువ చేసే సరకును సీజ్‌ చేశారు. కమిషనరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఒకటో ఠాణా పరిధిలో గుట్కా అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు డీసీఎం వ్యాను నుంచి ఇతర వాహనాల్లోకి బస్తాలను లోడు చేస్తుండగా దాడి చేశారు. మహ్మద్‌ రిజ్వాన్‌, షేక్‌ నవాజ్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. వాహనాలను ఠాణాకు తరలించి సీజ్‌ చేశారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారందరిపై కేసులు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు బృందాన్ని అభినందించారు. వీరికి ప్రత్యేకంగా రివార్డు అందిస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here