రూ.17,000 కోట్ల పెట్రోల్, డీజిల్ సెస్ మళ్లింపు, అసలు ధర ఇదీ!

0
3


రూ.17,000 కోట్ల పెట్రోల్, డీజిల్ సెస్ మళ్లింపు, అసలు ధర ఇదీ!

పెట్రోల్, డీజిల్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఇలా వాహనదారుల నుంచి వచ్చే సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు కూడా మళ్లిస్తోంది. పెట్రోల్, డీజిల్ పైన సెస్‌గా విధించే సొమ్ము నుంచి 2018-19, 2019-20లలో రూ.17,000 కోట్లు ఇతర మార్గాలకు మళ్లించిందట. ఇటీవల బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ పైన రూ.1 అదనంగా సెస్ విధించిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది అంచనా రూ.1.27 ట్రిలియన్లు

పెట్రోల్, డీజిల్ సెస్ ద్వారా వచ్చే సొమ్మును సెంటర్ రోడ్డు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF)కు మళ్లుతాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ సెస్ ద్వారా ప్రభుత్వానికి రూ.1.13 ట్రిలియన్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.1 సెస్ విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.27 ట్రిలియన్లు వస్తాయని అంచనా. కానీ ఈ మొత్తాన్ని అటు మళ్లించడం లేదు.

అభివృద్ధి కోసం నిధుల మళ్లింపు

అభివృద్ధి కోసం నిధుల మళ్లింపు

2018-19లో రూ.9వేల కోట్లకు పైగా, 2019-20లో దాదాపు 8వేల కోట్లు మళ్లిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఎటు మళ్లించారనే పేర్కొనలేదు. అయితే నవోదయ పాఠశాలలకు వీటి నుంచి ప్రభుత్వం దాదాపు రూ.3వేల కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు నిధుల కొరత ఉంది. దీంతో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. అప్పుడు టోల్ ట్యాక్స్ రూపంలో వాహనదారుల నుంచి కొంతమొత్తం వసూలు చేస్తారు. అలాగే, పెట్రోల్, డీజిల్ పైన వచ్చే సర్ ఛార్జీని ప్రభుత్వం తనకు నచ్చిన అభివృద్ధి పనులకు కేటాయించవచ్చు.

పెట్రోల్ ధర ఇలా పెరుగుతుంది..

పెట్రోల్ ధర ఇలా పెరుగుతుంది..

ఉదారణకు.. జూలై 6, 2019 బ్యారెల్ పెట్రోల్ ధర 58.72 డాలర్లు లేదా రూ.4,019 గా ఉంది. అంటే లీడర్ ధర రూ.25.27. బేసిక్ OMC (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) కాస్ట్ కాలిక్యులేషన్ ప్రకారం.. ఎంట్రీ ట్యాక్స్, రిఫైనర్ ప్రాసెసింగ్, ఓఎంసీ మార్జిన్, ఫ్రీట్ కాస్ట్, లాజిస్టిక్ అన్నీ కలిపి పెట్రోల్ లీటర్‌కు రూ.8.64. అంటే అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.33.91 అవుతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ రూ.19.98. అప్పుడు దీని ధర రూ.53.89. ఢిల్లీ ప్రకారం పెట్రోల్ పంప్ డీలర్స్ కమిషన్ రూ.3.56. అప్పుడు దీని ధర రూ.57.45. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ ప్లస్ 25 పైసలు పొల్యూషన్ సెస్, సర్‌చార్జ్ రూ.15.51. దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.72.96గా ఉంది. వ్యాట్ కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here