రూ.2,000 వరకు పడిపోయిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పెరుగుదల

0
2


రూ.2,000 వరకు పడిపోయిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పెరుగుదల

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఈ రోజు (అక్టోబర్ 31) స్వల్పంగా తగ్గాయి. అమెరికా – చైనా ట్రేడ్ టాక్స్ సానుకూలంగా ఉండటం వంటి వివిధ వివిధ కారణాల వల్ల గోల్డ్ ఫ్యూచర్ ధరలు మన వద్ద పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాస్త స్టేబుల్‌గా ఉన్నాయి. దీపావళి, ధన్‌తెరాస్ తర్వాత ఈ వ్యాల్యుబుల్ గోల్డ్ కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 31) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

అత్యధిక రికార్డ్ నుంచి రూ.2,000 వరకు తగ్గింపు

ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ ధర ఈ రోజు (అక్టోబర్ 31) 0.12 శాతం తగ్గి రూ.38,043గా ఉంది. వెండి ఫ్యూచర్ ధర 0.02 శాతం తగ్గి కిలోకు రూ.46,111గా ఉంది. బంగారం ధర స్వల్పంగా తగ్గా, వెండి ధర పెరిగింది. బంగారం ధర సెప్టెంబర్ నెల ప్రారంభంలో 10 గ్రాములకు రూ.40 వేల మార్క్ దాటింది. దీంతో పోలిస్తే రూ.1,950 నుంచి రూ.2,000 వరకు పడిపోయింది. వెండి ధర రూ.51 వేల నుంచి ఐదువేల వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.03 శాతం పెరిగి ఔన్స్ 1,499 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర 17.88 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో…

ఫెడ్ రేట్ కట్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఔన్సుకు వరుసగా 1,506 డాలర్లు, 18 డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోసారి రేట్ కట్ పైన ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ఇవ్వలేదని, కాబట్టి ధరలు స్టేబుల్‌గా ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది బంగారం ధర పదహారు శాతం వరకు పెరిగింది. ప్రపంచ మాంద్యం భయం, చైనా – అమెరికా వాణిజ్య యుద్ధం భయం, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం దిశగా దృష్టిసారించారు.

బంగారం

బంగారం

ఇటీవలి వరకు ఆర్థిక మాంద్యం భయం కనిపించినా, కొద్ది రోజులుగా ఎనకామిక్ గ్రోత్ డేటాలో వృద్ధి కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో బంగారం ధర షార్ట్ రన్‌లో మరింతగా పెరగకపోవచ్చునని సీఎంసీ మార్కెట్స్ స్ట్రాటెజిస్ట్ మైఖేల్ అన్నారు. ఓ వైపు డాలర్ పరిస్థితికి తోడు ఈక్విటీ మార్కెట్లు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయని, మరోవైపు క్లిష్టమైన ప్రాథమిక స్థాయి ఔన్సుకు 1510 డాలర్లకు మించి బంగారం ధర చూడటం సవాల్ అంటున్నారు.

అంతర్జాతీయంగా స్వల్పంగా పెరిగే అవకాశం

అంతర్జాతీయంగా స్వల్పంగా పెరిగే అవకాశం

బుధవారం ఫెడ్ రేట్ కట్ తర్వాత అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఫెడ్ రేట్ కట్ నేపథ్యంలో బంగారం వంటి వాటి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. బంగారం 1500 డాలర్లు నుంచి 1525 డాలర్ల మధ్య ఒత్తిడి ఎదుర్కొంటోందని చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here