రూ.301 తగ్గిన బంగారం, రూ.900కు పైగా తగ్గిన వెండి ధర

0
1


రూ.301 తగ్గిన బంగారం, రూ.900కు పైగా తగ్గిన వెండి ధర

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో బలహీన సంకేతాలు, డిమాండ్ లేమితో కొద్ది రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల బంగారం పలుమార్లు బంగారం రూ.40,000 మార్క్ దాటింది. జీవనకాల గరిష్టానికి చేరుకుంది. తాజాగా, బుధవారం పసిడి ధరలు రూ.301 తగ్గాయి. దీంతో 39,000కు దిగువకు చేరుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.38,870గా ఉంది. మరోవైపు, వెండి కూడా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ఈ రోజు రూ.900కు పైగా తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.46,509గా ఉంది.

బంగారం ధరలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ క్షీణించడం, అమెరికా – చైనా దేశాల మధ్య ట్రేడ్ చర్చలు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. దేశంలోను బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాడ్ గోల్డ్ ధరలు ఔన్సుకు 0.2 శాతం పెరిగి 1,486.53గా ఉంది. అంతకుముందు సెషన్లో 1.7 శాతం తగ్గింది.

కాగా, పసిడి దిగుమతులకు తగ్గిన విషయం తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటం, ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అతివిలువైన లోహాల్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదట. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన థర్డ్ క్వార్టర్లో బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 32% తగ్గి 123.9 టన్నులకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

బంగారం వినిమయంలో మొదటి స్థానంలో ఉన్న చైనా కూడా దిగుమతులు 66% తగ్గి 80.5 టన్నులకు పడిపోయినట్లు తెలిపింది. డిమాండ్ పెంచేందుకు ఆభరణాల వర్తకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని, గతంలో దిగుమతి చేసుకున్న ఆభరణాలు రీసైక్లింగ్‌కు మొగ్గుచూపారని ఈ నివేదిక తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here