రూ.600కే జియో గిగాఫైబర్ 3 రకాల సేవలు: స్పీడ్, ఇతర ప్రయోజనాలివే…

0
1


రూ.600కే జియో గిగాఫైబర్ 3 రకాల సేవలు: స్పీడ్, ఇతర ప్రయోజనాలివే…

రిలయన్స్ జియో గిగాఫైబర్ ఆగస్ట్ 12వ తేదీన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ, ఆ రోజు జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) సందర్భంగా సేవలు ప్రారంభించే అవకాశం అవకాశముందని అంటున్నారు. ఫైబర్ టు ది హోమ్ (FTTH) టెక్నాలజీ ద్వారా పని చేయనున్న గిగాఫైబర్ ద్వారా తక్కువ ధరకే మూడు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. బ్రాడ్‌బాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెన్షన్… ఈ మూడు రకాల సేవలను అందించే కాంబోసర్వీస్ గిగాఫైబర్.

రూ.600కు ఈ మూడు రకాల సేవలు

దేశంలోని 1,600 నగరాల్లో తన బ్రాడ్‌బాండ్ సర్వీస్ ద్వారా FTTH సేవలు అందించాలని రిలయన్స్ జియో నిర్ణయించింది. అయితే వీటి ధరలు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. ఇప్పటికే గిగాఫైబర్ పైన ట్రయల్ రన్ కండక్ట్ చేస్తున్నారు. రిలయన్స్ జియో గిగాఫైబర్ సర్వీస్ ద్వారా బ్రాడ్‌బాండ్ సేవలను సెకనుకు 1 జీబీ స్పీడ్‌తో పొందవచ్చు. 600 టీవీ ఛానల్స్ వస్తాయి. ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటుంది. దీనికి నెల సబ్‌స్క్రిప్షన్ రూ.600 మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు.

సెక్యూరిటీ డిపాజిట్

సెక్యూరిటీ డిపాజిట్

జియో గిగా ఫైబర్ ప్లాన్‌లో పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జియో యూజర్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఈ సేవలు వద్దనుకుంటే ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ఓఎన్‌టీ డివైజ్ (గిగాహబ్ హోమ్ గేట్‌వే) బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు రోటర్‌లా పని చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్‌కు రూ.4,500 ఉంటుందని తొలుత వార్తలు వచ్చాయి, ఆ తర్వాత రూ.2,500 మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.

గిగాఫైబర్ స్పీడ్‌పై నెట్‌ఫ్లిక్స్ ISP రిపోర్ట్..

గిగాఫైబర్ స్పీడ్‌పై నెట్‌ఫ్లిక్స్ ISP రిపోర్ట్..

ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర వైర్‌సెట్స్‌తో పోలిస్తే రిలయన్స్ గిగా ఫైబర్ సేవలు హైఎండ్ టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్స్‌తో స్పీడ్‌గా ఉంటుంది. రిలయన్స్ జియో బ్రాండ్ బాండ్ సేవల స్పీడ్ 1Mbps నుంచి 1Gbps వరకు ఉంటుంది. ఇప్పటికే గిగాఫైబర్ టెస్టింగ్ సేవలు నిర్వహిస్తోంది. ఇటీవల చేసిన ఓ సర్వేలో ఇండియా స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా గిగా ఫైబర్ నిలిచింది. ఫిబ్రవరి 2019లో, రిలయన్స్ జియో గిగా ఫైబర్ స్పీడ్ 3.61Mbpsగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ISP స్పీడ్ ఇండెక్స్ రిపోర్ట్ చేసింది.

గిగా ఫైబర్ అడ్వాంటేజ్

గిగా ఫైబర్ అడ్వాంటేజ్

గిగా ఫైబర్‌తో తక్కువ ధర, మూడు రకాల సేవలతో పాటు ఇతర ముఖ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి ఎలాంటి అప్‌గ్రెడేషన్ అవసరం లేదు. ఈ ఫైబర్ కేబుల్స్ ఎలక్ట్రానిక్ లైట్ పల్సెస్ ద్వారా అప్ గ్రేడ్ అవుతుంది. ఇదిలా ఉండగా, మైజియో యాప్ ద్వారా బ్రాడ్‌బాండ్ సేవలకు ఏ పేరు పెట్టాలో చెప్పాలని రిలయన్స్ జియో కస్టమర్లను కోరింది. యూజర్లకు జియో ఫైబర్, జియో హోమ్, జియో గిగా ఫైబర్ అనే మూడు ఆప్షన్స్ ఇచ్చింది.

తక్కువ ధరకే యాడ్ ఆన్ సేవలు

తక్కువ ధరకే యాడ్ ఆన్ సేవలు

జియో ద్వారా టెలికం రంగంలో రిలయన్స్ విప్లవం సృష్టించింది. వినియోగదారులకు తక్కువ ధరకే వాయిస్ కాల్స్, డేటా అందుతోంది. అలాగే, జియో గిగాఫైబర్ సేవలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటాయని భావిస్తున్నారు. జియోలాగే తక్కువ ధరకే యాడ్ ఆన్ సేవలు ఉంటాయని భావిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here