రూ.899కే టిక్కెట్: ఎయిర్ ఏసియా బంపరాఫర్.. నేడే చివరి రోజు

0
2


రూ.899కే టిక్కెట్: ఎయిర్ ఏసియా బంపరాఫర్.. నేడే చివరి రోజు

న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా ప్రయాణీకులకు బిగ్ సేల్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. డొమెస్టిక్ ట్రావెల్స్ పైన రూ.899 నుంచి ఆఫర్లు వర్తిస్తాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బిగ్ సేల్ మూడు రోజులతో ఈ రోజు ముగుస్తోంది. ఎయిర్ ఏసియా ప్రయాణీకులు ఎయిర్ ఏసియా ఇండియా అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఈ రోజుతో ముగియనున్న ఈ ఆఫర్ ట్రావెలింగ్ వాలిడేట్ ఫిబ్రవరి 10 2020 నుంచి 15 డిసెంబర్ 2020 మధ్య ఉంటుంది. ఈ మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ గురించి ట్విట్టర్ వేదికగా కస్టమర్లకు తెలియజేసింది. బిగ్ మెంబర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు కలిగిన వారు 24 గంటల ప్రియారిటీ యాక్సెస్ సదుపాయం పొందవచ్చు. దీని కోసం ప్రయాణీకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రోమో కోడ్ ఉపయోగించాలి.

మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియా బెర్హాడ్-టాటా జాయింట్ వెంచర్… ఎయిర్ ఏసియా ఇండియా. ప్రస్తుతం ఎయిర్ ఎసియా రోజుకు 165 విమానాలను నడుపుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here